వివాదాలకు తావివ్వకుండా పోడు భూముల సర్వే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-29T03:36:23+05:30 IST

పోడుభూముల సర్వేలో వివాదాలకు తావులేకుండా చూడాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం లోని వడ్డెపల్లి గార్డెన్‌లో బుధవారం ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌ పాయి, జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌తో కలిసి పోడుభూములకు సంబంధించిన సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వివాదాలకు తావివ్వకుండా పోడు భూముల సర్వే చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: పోడుభూముల సర్వేలో వివాదాలకు తావులేకుండా చూడాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం లోని వడ్డెపల్లి గార్డెన్‌లో బుధవారం ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌ పాయి, జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌తో కలిసి పోడుభూములకు సంబంధించిన సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పోడు భూముల సర్వేలో ఎవరైనా అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేతరువాత ఇంచు భూమి ఆక్రమ ణకు గురైన అధికారులపై చర్యలు తీసుకుంటామ న్నారు. ఎఫ్‌ఆర్సీ కమిటీసమావేశం తరువాతనే అర్హత, అనర్హత వెల్లడించాలన్నారు. సర్వేలో దరఖాస్తుదారు డి అర్హత, అనర్హత లాంటి వవరాలు తెలియజేయకూ డదన్నారు. ఎంపీడీవోలు, తహసీ ల్దార్‌లు, ఎఫ్‌ఆర్వోలు ఎప్పటికప్పుడు సర్వేపై సమీక్ష నిర్వహించా లన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 31వేల మంది దరఖాస్తు చేసుకున్నారని దీనికిగాను 1,21,000 ఎకరాల భూమికి దరఖాస్తులు వచ్చాయ న్నారు. ఎఫ్‌ఆర్సీ కమిటీని కూడా సర్వేలో భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో ఉండే పదినుంచి15మంది సభ్యు లలో మూడోవంతు గిరిజనులు ఉండేలా చూడాలన్నారు. సర్వేసందర్భంగా అధికా రుల తీరువల్ల ఏమైనా వివాదాలువస్తే వారి పై వేటుతప్పదని హెచ్చరించారు. భూము లకు సంబంధించి అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య ఉన్న విభేదాలు ముందస్తుగా తొలగించుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన నమునాలో వివరాలను నింపాల న్నారు. సర్వేలో లోటుపాటు లేకుండా క్షేత్రస్థాయికి వెళ్లిచూడాలన్నారు. జిల్లాఅటవీశాఖాధికారి దినేష్‌కు మార్‌ సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఉపయోగించే విధానాన్ని వివరించారు. అనంతరం అధికారులతో గ్రామసభలో అటవీభూముల పరిరక్షణకోసం చేయాల్సిన ప్రతిజ్ఞను చేయించారు.

Read more