ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-06-22T04:24:54+05:30 IST

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత ఆచార్య జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణం లోని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి
ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూల మాల వేస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జూన్‌ 21: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత ఆచార్య జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణం లోని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సురేష్‌చారి, భాస్కరాచారి, రాధాకృష్ణచారి, రమేశ్‌చారి, ప్రభాకర్‌చారి పాల్గొన్నారు.

బెజ్జూరు: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకుడు సకారాం, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానాలు జయశంకర్‌ చిత్రపటానికి పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు పార్ధిరా ం, నాయకులు శంకర్‌, నరేందర్‌, జావీద్‌, శంకర్‌, బాపు, మల్లేష్‌, సంకర్‌, రమేష్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more