బైరి నరేష్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T22:57:01+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 31: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పీడీ చట్టంప్రకారం కేసు నమోదు చేయాలని ఆసిఫాబాద్‌ అయ్యప్ప సేవాసంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

బైరి నరేష్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 31: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పీడీ చట్టంప్రకారం కేసు నమోదు చేయాలని ఆసిఫాబాద్‌ అయ్యప్ప సేవాసంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శనివారం అయ్యప్ప ఆలయం నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించి ప్రధానరహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా అయ్యప్ప ఆలయకమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌, ప్రధానకార్యదర్శివెంకట్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీచైర్మన్‌ మల్లేష్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్‌ మాట్లాడుతూ నాస్తి కత్వం అనేది ఇంటికి పరిమితం చేయాలి కానీ ప్రజాసభలో ప్రకటించడం ఇతరుల మనో భావాలను దెబ్బతీడమేనన్నారు. వెంటనే నరేష్‌పై పీడీ కేసునమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి చంద్రమోహన్‌, ఆలయ వ్యవస్థాపకుడు కిషన్‌, గురుస్వాములు సంతోష్‌, ప్రతాప్‌, గణేష్‌, అశోక్‌, శ్రీనివాస్‌, వినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:57:03+05:30 IST