రైతు సంక్షేమానికి పెద్దపీట
ABN , First Publish Date - 2022-06-29T04:09:53+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నా రు. మంగళవారం నెల్కివెంకటాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

దండేపల్లి, జూన్ 28: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నా రు. మంగళవారం నెల్కివెంకటాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అను సంధానం, పంట బీమా, వరికి క్వింటాల్‌కు రూ.2500 చెల్లిస్తామన్నారు. జడ్పీటీసీ నాగరాణిత్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా మహిళా అధ్య క్షురాలు పెంట రజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.