నేటి 2కే రన్‌ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T04:00:27+05:30 IST

కాగజ్‌నగర్‌లో గురువారం నిర్వహించే 2కే రన్‌ను యువకులు, విద్యార్థులు పాల్గొని పెద్దఎత్తున విజయవంతం చేయాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు.

నేటి 2కే రన్‌ను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎస్పీ సురేష్‌ కుమార్‌

-ఎస్పీ సురేష్‌ కుమార్‌ 

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 10: కాగజ్‌నగర్‌లో గురువారం నిర్వహించే 2కే రన్‌ను యువకులు, విద్యార్థులు పాల్గొని పెద్దఎత్తున విజయవంతం చేయాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పట్టణంలోని వివిధశాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి 2కే రన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మొక్క లు నాటారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐ రవీందర్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌: వజ్రోత్సవంలో భాగంగా పాత జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సురేష్‌కు మార్‌ మొక్కలు నాటారు. అనంతరం డీఎస్పీ కార్యాల యంలో సరస్వతీ శిశుమందిర్‌ విద్యార్థులతో కలిసి మరిన్ని మొక్కలునాటారు. ఈనెల11న ఉదయం 6.30 గంటలకు అన్నిమండలకేంద్రాల్లో 2కేరన్‌ నిర్వహిస్తా మని యువకులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోజైలు ముందు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం నుంచి ప్రారంభమై ఫారెస్టు చెక్‌పోస్టు మీదుగా గాంధీ చౌక్‌ వద్ద ముగుస్తుందన్నారు.

కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్పీ

ఆసిఫాబాద్‌: ఈనెల 1నుంచి 7వరకు గచ్చిబౌలిలో జరిగిన తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ ఏడోమీట్‌లో కౌటాల పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ స్రవంతి పదిమీటర్ల ఎయిర్‌పిస్టల్‌ కాంపిటేషన్‌లో మొదటిస్థా నంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ సాధించింది. బుధవారం ఎస్పీసురేష్‌కుమార్‌ అభినందించి సన్మానించారు. 

Read more