ట్విటర్‌ ‘ఎడిట్‌ ట్వీట్‌’

ABN , First Publish Date - 2022-10-08T10:07:09+05:30 IST

ట్విటర్‌ ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ను కొద్దికాలంగా టెస్టింగ్‌ దశలో ఉంచింది. విడుదల చేసిన ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యం దీంతో యూజర్లకు లభిస్తుంది.

ట్విటర్‌ ‘ఎడిట్‌ ట్వీట్‌’

ట్విటర్‌ ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ను కొద్దికాలంగా టెస్టింగ్‌ దశలో ఉంచింది. విడుదల చేసిన ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యం దీంతో యూజర్లకు లభిస్తుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లోని ట్విటర్‌ బ్లూ యూజర్లకు మొదట ఇది అందుబాటులోకి వస్తుంది. బ్లూ యూజర్ల అంటే పెయిడ్‌ ఆప్షన్‌. దీనికి నెలవారి సబ్‌స్ర్కిప్షన్‌ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ ఇండియాలో లేనందున ఎడిట్‌ బటన్‌ కూడా మన దేశంలో యూజర్లకు అందుబాటులో ఉండదు. 


ట్విటర్‌ ఇటీవల తన సొంత ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకుంది. ట్వీట్‌ అడుగున ‘లాస్ట్‌ ఎడిటెడ్‌’ అని కనిపించింది. ‘లాస్‌ ఎడిటెడ్‌’పై క్లిక్‌ చేసినప్పుడు ఏమేమి మార్పులు చేశారన్నది తెలుస్తుంది. ఎడిట్‌ అయిన ట్వీట్‌కు సేమ్‌ ఐడీ ఉంటుంది. ఒరిజినల్‌ ట్వీట్‌కు మాత్రం యూఆర్‌ఎల్‌ విషయంలో తేడా ఉంటుంది. 30 నిమిషాలు అంటే అరగంట వ్యవధిలో కావాల్సిన అన్ని సార్లు ఎడిట్‌ చేసుకునే వెసులుబాటు ఈ ఆప్షన్‌తో లభిస్తుంది. ప్రస్తుతం దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ట్విటర్‌ పరిశీలిస్తోంది.  

Read more