జియో 5జీ ఫోన్‌ వివరాలు ఇవేనట!

ABN , First Publish Date - 2022-10-01T06:13:18+05:30 IST

జియో 5జీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫోన్‌ విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ సదరు హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్స్‌ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి లీకవుతున్నాయి.

జియో 5జీ ఫోన్‌ వివరాలు ఇవేనట!

జియో 5జీ  పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫోన్‌ విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ సదరు హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్స్‌ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి లీకవుతున్నాయి. కొత్త లీక్‌ ప్రకారం స్నాప్‌డ్రాగన్‌ 480 ఎస్‌ఓసీ పవర్‌కు తోడు 4జీబీ ర్యామ్‌, 32 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజీతో హ్యాండ్‌ సెట్‌ అందుబాటులోకి రానుంది.  ఆండ్రాయిడ్‌ 12పై పనిచేస్తుంది. 90హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేట్‌ డిస్‌ప్లే ఉంది. డ్యూయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ ఉంది. 13-మెగా పిక్సల్‌ ప్రైమరీ సెన్సర్‌ కూడా ఉంది. 5జీ కనెక్టివిటీతో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకువస్తున్నట్టు, అలాగే భారత్‌లో దీని విస్తరణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయనున్నట్టు రిలయన్స్‌ ఇప్పటికే ప్రకటించింది. హ్యాండ్‌సెట్‌కోసం కొలాబిరేట్‌ అవుతున్న కంపెనీ నుంచి లీకైందని చెబుతున్న వివరాల ప్రకారం గంగ కోడ్‌ నేమ్‌ కాగా మోడల్‌ నంబర్‌ ఎల్‌ఎస్‌1654క్యుబి5. ఎల్‌వైఎఫ్‌తో కలిసి ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుంది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ హ్యాండ్‌ సెట్‌ ధర రూ.8000 - రూ.12000 మధ్య ఉంటుంది. 

Read more