కొత్త మోడల్ Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN , First Publish Date - 2022-04-30T22:33:38+05:30 IST

కొత్త మోడల్ Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్ విడుదల

కొత్త మోడల్ Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో రియల్‌మి జీటీ నియో 3 అల్ట్రాడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. గత నెలలో చైనా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో రియల్‌మి జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్‌మి జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ రూ. 36,999, 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ఫోన్ రూ.38,999 ఉంటుందని కంపెనీ తెలిపింది. 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్‌మి జీటీ నియో 3 150W model ఫోన్ రూ. 42,999 ఉంటుంది. Realme.com, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. మే 4వ తేదీ నుంచి ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2022-04-30T22:33:38+05:30 IST