ఐజీటీవీ యాప్‌నకు రాం.. రాం..

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ అతిత్వరలో ఐజీటీవీ యాప్‌ను తొలగిస్తోంది. షార్ట్‌

ఐజీటీవీ యాప్‌నకు రాం.. రాం..

ఇన్‌స్టాగ్రామ్‌ అతిత్వరలో ఐజీటీవీ యాప్‌ను తొలగిస్తోంది. షార్ట్‌ వీడియో ఫార్మేట్‌ ‘రీల్స్‌’ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ యాప్‌ను తొలగించనున్నట్టు ‘టెక్‌క్రంచ్‌’ వెల్లడించింది.  ఇదిలా ఉండగా ఫుల్‌ స్ర్కీన్‌ వ్యూయర్‌, ఆప్షన్‌ టు ట్యాప్‌ మ్యూట్‌ వంటి ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకువస్తోంది.



 


వీడియో షేరింగ్‌, క్రియేషన్‌ టూల్స్‌ను సేమ్‌ కంటెంట్‌ను ఒక దగ్గరకు చేర్చడం, కొత్త కంటెంట్‌ను వెతుక్కోవడం తదితరాల సెర్చింగ్‌  వంటివాటిపై కూడా పనిచేస్తోంది. ఇదంతా సరికొత్త అనుభవం కాగా, రీల్స్‌ సృష్టికర్తలు తమ పోస్టింగ్‌ల్లోని డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ నుంచి ఆదాయం పెంచుకునేలా చూడాలన్న యోచన కూడా తాజా మార్పులో ఉంది. 


ఫీడ్‌లో పోస్ట్‌ చేసే వీడియోల నిడివిని గంటకు పెంచారు. గతంలో ఇంత నిడివి కేవలం ఐజిటీవీ వీడియోలకు మాత్రమే ఉండేది. అదీ కూడా ఆ వీడియోను చూడాలంటే మెయిన్‌ అప్లికేషన్‌ నుంచి ఎగ్జిట్‌ అయ్యేది.


ఇప్పుడు యూజర్లు  హోమ్‌ పేజీ రైట్‌ కార్నర్‌లో ప్లస్‌ గుర్తును టాప్‌ చేసి, 60 నిమిషాల వ్యవధి గల వీడియోను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెయిన్‌ పేజీ మీద డిస్‌ప్లే వీడియో వీక్షణను ఒక నిమిషానికి పరిమితం చేశారు. ప్రీవ్యూని పదిహేను సెకండ్లు చేశారు. 


ఐజీటీవీ వీడియో కాన్సెప్ట్‌ అలాగే ఫీడ్‌ వీడియోను ఒక గొడుగు కిందకు చేర్చే ఉద్దేశంతో చాలా కాలం క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అన్ని వీడియోలను మెయిన్‌ యాప్‌లోకి తీసుకురావడానికి తోడు జనానికి కూడా అంతా ఒక్క దగ్గర లభ్యమయ్యేలా చూడటమే ఈ మార్పు లక్ష్యమని కంపెనీ సైతం ఒక బ్లాగ్‌లో వివరించింది.


Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST