కొత్త మోడల్ Poco M4 5G ఫోన్ విడుదల
ABN , First Publish Date - 2022-04-30T23:09:57+05:30 IST
కొత్త మోడల్ Poco M4 5G ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ పోకో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లలో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో పోకో ఎం4 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో పోకో ఎం4 5జీ స్మార్ట్ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 12,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ.14,999 ఉంటుంది. ఫోన్లను కొనుగోలు చేసిన ఎస్బీఐ కస్టమర్లకు తక్షణ డిస్కౌంట్ రూ. 2000 వరకు లభిస్తోందని కంపెనీ తెలిపింది. మే 5 నుంచి ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.