ఫోన్‌ స్పీకర్‌ ‘క్లీనింగ్‌’

ABN , First Publish Date - 2022-06-25T10:26:45+05:30 IST

ఫోన్‌ స్పీకర్‌ నుంచి వెలువడే ధ్వనిలో అస్పష్టత ఉంటే వెంటనే క్లీన్‌ చేయాలని అర్థం చేసుకోండి.

ఫోన్‌ స్పీకర్‌ ‘క్లీనింగ్‌’

ఫోన్‌ స్పీకర్‌ నుంచి వెలువడే ధ్వనిలో అస్పష్టత ఉంటే వెంటనే క్లీన్‌ చేయాలని అర్థం చేసుకోండి. క్లీనింగ్‌ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్‌ని అనునిత్యం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే దుమ్ము చేరే పార్ట్‌ అంటే స్పీకర్స్‌. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ అంటూ ఏమీ ఉండదు.  దేనికైనా పోర్ట్స్‌ ద్వారా దుమ్ము దూళి చేరుతూ ఉంటుంది. 

కొద్దిగా ఖర్చయినప్పటికీ ‘కంప్లీట్‌ క్లీనింగ్‌ కిట్‌’ అవసరం. పద్ధతిగా, శుభ్రంగా క్లీన్‌ చేసేందుకు అది ఉపయోగపడుతుంది. చాలా ఇరుకైన స్పేస్‌లో టూల్స్‌ అన్నీ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని చాలా జాగ్రత్తగా శుభ్రపర్చుకోవాలి. 

అంత ఖర్చు పెట్టలేనప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉండే బ్రష్‌ అయినా వాడాలి. బ్రష్‌ వెంట్రుకలు సాఫ్ట్‌గా ఉండాలి. ఫోన్‌ స్పీకర్‌ ఓపెనింగ్‌ పోరస్‌ నుంచి మురికిని తొలగించేందుకు ఉపయోగించాలి. 

మంచి స్టికీ టేప్‌తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. వేలికొనకు ఆ టేపును చుట్టుకుని గ్లూ పార్ట్‌ బయట, తదుపరి జాగ్రత్తగా స్పీకర్‌  గ్రిల్‌ నుంచి డస్ట్‌ను తొలగించాలి. గ్రిల్‌ దగ్గర డస్ట్‌ ఉండకుండా సున్నితంగా తొలగించాలి. 

కంప్రెస్డ్‌ ఎయిర్‌ని పంప్‌ చేయడం ద్వారా స్పీకర్‌ గ్రిల్‌ అలాగే చార్జింగ్‌ పోర్ట్‌ను శుభ్రం చేసుకోవచ్చు. కొన్ని క్లీనింగ్‌ కిట్స్‌లో కంప్రెస్డ్‌ ఎయిర్‌ పంప్స్‌ ఉంటాయి. ఇండస్ట్రియల్‌ సస్టయిన్‌ ఎయిర్‌ పంప్‌ను ఉపయోగించవద్దు. పీసీల క్లీనింగ్‌ మాదిరిగా పక్కాగా ఎయిర్‌ స్ట్రీమ్‌ అయ్యేలా చూసుకోవాలి. 

దూది లేదంటే కాటన్‌ క్లాత్‌తో కొత్త ఫోన్లను చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. ఆ పని తరచూ చేయగలిగితే, ఫోన్‌ స్పీకర్‌ వద్దకు దుమ్ము చేరుకోదు.  మొత్తమ్మీద కొద్దిపాటి జాగ్రత్తలతో క్లీన్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-06-25T10:26:45+05:30 IST