అడ్మిన్లకు మరిన్ని డిలీట్ అధికారాలు
ABN , First Publish Date - 2022-08-06T06:02:05+05:30 IST
వాట్సాప్ మెసేజ్‌లను గ్రూపులో డిలీట్ చేసే అధికారం అడ్మిన్‌కు ఉంటుంది. అందరివీ లేదా వ్యక్తులుగా ఒకొక్కరి మెసేజ్‌లను డిలీట్ చేసే వెసులుబాటును అడ్మిన్లకు వాట్సాప్ ఇచ్చింది.

వాట్సాప్ మెసేజ్‌లను గ్రూపులో డిలీట్ చేసే అధికారం అడ్మిన్‌కు ఉంటుంది. అందరివీ లేదా వ్యక్తులుగా ఒకొక్కరి మెసేజ్‌లను డిలీట్ చేసే వెసులుబాటును అడ్మిన్లకు వాట్సాప్ ఇచ్చింది. ఇందుకోసం కొత్తగా గ్రూప్ మోడరేషన్ ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోందని డబ్ల్యూఎబేటాఇన్ఫో వెల్లడించింది. అడ్మిన్ డిలీట్ ఫీచర్ విడుదలవుతున్నట్టు కూడా తెలిపింది. ఆండ్రాయిడ్ 2.22.1.7తో అప్డేట్ వాట్సాప్ బేటాతో వస్తోంది. బేటా టెస్టర్ల జాబితాలో ఉండి గ్రూప్ అడ్మిన్లైతే గ్రూప్‌లో ఎవరిదైనా, అందరివైనా మెసేజ్‌లను డిలీట్ చేసేయవచ్చు. దీనికోసం ఇన్కమింగ్ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. తరవాత డిలీట్ ఫర్ ఎవ్విర్వన్ని టాప్ చేసి మెసేజ్‌ని డిలీట్ చేయాలి. తమ మెసేజ్‌ని అడ్మిన్ డిలీట్ చేశారని గ్రూప్‌లోని ఇతర సభ్యులు తెలుసుకుంటారు.
అయితే ఈ ఫీచర్ పబ్లిక్‌లోకి ఎప్పటికి చేరుతుందన్న విషయమై సమాచారం లేదు. అందుకు కొంత సమయం పట్టవచ్చని భోగట్టా. గ్రూప్ కాన్వర్షేషన్స్ కోసం వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను జతచేసింది. ఇతరులను మ్యూట్‌లో ఉంచడం, కాల్ సమయంలో ఇతరులకు మెసేజ్పండం వంటివి ఉన్నాయి. స్పందనలు అలాగే అవతార్స్‌ను కూడా విడుదల చేయనుంది. డెవలప్మెంట్ దశలో ఉన్న మరికొన్ని రాబోయే వారాల్లో రిలీజ్ కావచ్చు.