మొబైల్‌ గేమ్స్‌ బెస్ట్‌‘పర్ఫార్మెన్స్‌’ టిప్స్‌

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

మొబైల్‌ గేమ్స్‌ తరచుగా ఆడుతుంటారా! దీంతో మొబైల్‌ వేడుక్కుతోందా! అయితే అలా కాకుండా

మొబైల్‌ గేమ్స్‌  బెస్ట్‌‘పర్ఫార్మెన్స్‌’ టిప్స్‌

మొబైల్‌ గేమ్స్‌ తరచుగా ఆడుతుంటారా! దీంతో మొబైల్‌ వేడుక్కుతోందా! అయితే అలా కాకుండా చేయడానికి ఒక ట్రిక్కు ఉంది. ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ కేవలం సమాచారం తెలుసుకోడానికే పరిమితం కాదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యువతకు అదో ‘ఆట’పట్టు. పబ్జీ, బీజీఎంఐ, మైన్‌క్రాఫ్ట్‌, పోకెమన్‌ సహా పలు ఆటలకు వేదికగా మొబైల్‌ నేడు మారింది. అదే పనిగా ఆడటంతో డివైస్‌ వేడెక్కుతుంది. ఫలితంగా దాని జీవిత కాలం సైతం దెబ్బతింటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 



 ఈ మధ్యకాలంలో వస్తున్న హై ఎండ్‌ ఫోన్లలో అత్యధికం వేర్వేరు రిఫ్రెష్‌ రేట్లు కలిగి ఉంటున్నాయి. వినియోగదారుడి వెసులుబాటు మేరకు వీటిని అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. వేగం పెంచుకోవచ్చు. స్ర్కీన్‌పై యానిమేషన్స్‌ను పక్కనపెట్టి డివైస్‌ సాఫీగా పనిచేసేలా చూసుకోవచ్చు. చేయాల్సిందల్లా రిఫ్రెష్‌ రేటును అవసరాన్ని తగ్గట్టు సర్దుబాటు చేసుకోవడమే.


 డివైస్‌ మెయింటెనెన్స్‌లో జంక్‌ ఫైల్స్‌ క్లీనింగ్‌ కూడా ముఖ్యమే. డివైస్‌ ఫైల్స్‌తో నిండుకుంటే ఫోన్‌ వేగం తగ్గుతుంది. అనవసరమైన భారాన్ని తగ్గించుకోవాలి. ఫోన్‌లో స్టోరేజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఫ్రీ అప్‌ స్పేస్‌ని టాప్‌ చేయాలి. తదుపరి క్లీన్‌ చేయాలని అనుకుంటున్న ఫైల్స్‌ని టాప్‌ చేయాలి. అలా స్పేస్‌ని ఫ్రీ చేసుకోవాలి.


 మల్టీ ప్లేయిర్‌ గేమ్స్‌లో వాయిస్‌ చాట్‌ నిజంగా బోర్‌ అనిపిస్తుంది. క్లియర్‌ కాని ఆడియో, డిస్‌కనెక్షన్స్‌, ఫుష్‌-టు-టాక్‌ బటన్స్‌ గేమింగ్‌ అనుభవానికి ఆటంకంగా పరిణమిస్తాయి. వీటిని డిస్కార్డ్‌తో తప్పించుకోవచ్చు. ఇదో ఆప్ట్‌మైజ్డ్‌ యాప్‌. కమ్యూనికేషన్‌తో సహకరిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డిస్కార్డ్‌ ఓవర్లే ఫీచర్‌ని యాక్సెస్‌ చేసుకోవచ్చు. 


 4ఎక్స్‌ ఎంఎ్‌సఏఏ ఆప్షన్‌ మల్టీ శాంప్లింగ్‌ టూల్‌. చాలా గేమ్స్‌లో ఇది ఉంటుంది. గ్రాఫిక్స్‌, పర్ఫార్మెన్స్‌ని సమతుల్యపరుస్తుంది. ఒపెన్‌ జీఎల్‌ 2.0 డ్రైవర్‌పై రన్‌ అయ్యే గేమ్స్‌లో ఈ సెట్టింగ్‌ అందుబాటులో ఉంటుంది. గేమ్‌ సెట్టింగ్స్‌ లేదంటే ఫోన్‌ డెవలపర్‌ సెట్టింగ్స్‌ ద్వారా హార్డ్‌-రాక్‌తో దీన్ని పొందవచ్చు. సెట్టింగ్స్‌ యాప్‌లో ఎబౌట్‌ ఫోన్‌ టాబ్‌ను ఓపెన్‌ చేసి బిల్డ్‌ నంబర్ని పదేపదే క్లిక్‌ చేయడం ద్వారా డెవలపర్‌ ఇంటర్‌ఫే్‌సని అన్‌లాక్‌ చేయాలి. ఒకసారి ఇది జరిగితే చాలు, మళ్ళీ వెనక్కు బ్యాక్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సిస్టమ్‌ని టాప్‌ చేసి డెవలపర్‌ ఆప్షన్స్‌లోకి వెళితే 4ఎక్స్‌ ఎంఎ్‌సఏఏని పొందవచ్చు. 


Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST