మెసెంజర్‌లో డెడికేటెడ్ కాల్స్ ట్యాబ్.. త్వరలోనే అందుబాటులోకి

ABN , First Publish Date - 2022-06-02T21:42:15+05:30 IST

ఫేస్‌బుక్ మెసెంజర్‌ యూజర్లకు ఇది శుభవార్తే. ఈ యాప్‌లో త్వరలోనే డెడికేటెడ్ కాల్స్ ట్యాబ్ అందుబాటులోకి రానుంది..

మెసెంజర్‌లో డెడికేటెడ్ కాల్స్ ట్యాబ్.. త్వరలోనే అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ మెసెంజర్‌ యూజర్లకు ఇది శుభవార్తే. ఈ యాప్‌లో త్వరలోనే డెడికేటెడ్ కాల్స్ ట్యాబ్ అందుబాటులోకి రానుంది. మెసెంజర్‌లో ప్రస్తుతం కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ అది హోం స్క్రీన్‌లో కనిపించదు. ఇందుకోసం సెపరేట్ థ్రెడ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనం కాల్ చేయాలనుకున్న వ్యక్తి కాంటాక్ట్ ఓపెన్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు వాట్సాప్‌లా హోం స్క్రీన్‌పైనే ఈ డెడికేటెడ్ కాలింగ్ ట్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ట్యాబ్ చాట్స్‌కు, పీపుల్స్ ట్యాబ్‌కు మధ్యన యాప్ స్క్రీన్ లోయర్ బార్ కింద కనిపించనుంది. 


కరోనా మహమ్మారి సమయంలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లోని వీడియో కాలింగ్ ఫీచర్ బాగా పాపులర్ అయింది. ఆడియో, వీడియో కాల్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే హోం స్క్రీన్‌పై కాలింగ్ బటన్‌ను ఏర్పాటు చేయాలని తాజా నిర్ణయించింది. 2020 తర్వాత మెసెంజర్‌లో ఆడియో, వీడియో కాలింగ్ 40 శాతం పెరిగినట్టు ‘మెటా’ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మెసెంజర్ యూజర్లు ప్రతి రోజూ 300 మిలియన్ ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నారు.  

Updated Date - 2022-06-02T21:42:15+05:30 IST