WhatsApp: వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు!

ABN , First Publish Date - 2022-12-22T19:40:37+05:30 IST

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) మరో కొత్త అప్‌డేట్ ప్రవేశపెట్టింది.

WhatsApp: వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు!

న్యూఢిల్లీ: యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) మరో కొత్త అప్‌డేట్ ప్రవేశపెట్టింది. యాక్సిడెంటల్ డిలీట్’ టూల్‌ను (Accidental Delete) తీసుకొచ్చింది. దీని ద్వారా ‘డిలీట్ ఎవ్రీవన్’కు బదులు ‘ఓన్లీ ఫర్ మీ’ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసిన మెసేజులను తిరిగిపొందొచ్చు.

కొన్నిసార్లు పొరపాటున ఒక వ్యక్తికి పంపించాల్సిన మెసేజులను ఇంకొకరికి పంపిస్తుంటాం. విషయాన్ని గుర్తించిన వెంటనే కంగారుగా డిలీట్ చేసే ప్రయత్నంలో అక్కడా తప్పుచేస్తాం. ‘డిలీట్ ఎవ్రీవన్’కు బదులు ‘ఓన్లీ ఫర్ మీ’ ఆప్షన్‌ ట్యాప్ చేస్తుంటాం. ఈ పరిస్థితి యూజర్లకు కాస్త ఇబ్బందికరమే. ఎందుకంటే పొరపాటును పంపించిన మెసేజులను డిలీట్ చేయడం కుదరకపోవడమే. పంపిన వ్యక్తికి డిలీట్ అయినా అవతలి వారి చాట్‌లో మెసేజ్ అలాగే ఉండిపోతుంది. కానీ ఇకపై ఈ విషయంలో యూజర్లు చింతించాల్సిన అవసరం లేదు. ఈ పొరపాటును సరిదిద్దుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించింది. ఇందుకోసమే ‘యాక్సిడెంటల్ డిలీట్’ టూల్‌ను (Accidental Delete) వాట్సప్ ప్రవేశపెట్టింది. ‘యాక్సిడెంటల్ డిలీట్’ ఫీచర్ ద్వారా యూజర్లు డిలీట్ చేసిన మెసేజులను క్విక్‌గా అన్‌డు చేయవచ్చు. అంటే డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి పొందొచ్చు. అప్పుడు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఆప్షన్ ద్వారా చాట్‌ను డిలీట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌ల యూజర్లు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని మెటా సారధ్యంలోని వాట్సప్ వెల్లడించింది.

Updated Date - 2022-12-22T19:40:44+05:30 IST