Message Yourself: వాట్సప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్.. ప్రతిఒక్కరికీ యూజ్‌ఫుల్..

ABN , First Publish Date - 2022-11-29T18:02:10+05:30 IST

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను (new features) అందుబాటులోకి తీసుకొచ్చే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) మరో నూతన అప్‌డేట్‌ను (update) ప్రవేశపెట్టింది.

Message Yourself: వాట్సప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్.. ప్రతిఒక్కరికీ యూజ్‌ఫుల్..

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను (new features) అందుబాటులోకి తీసుకొచ్చే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) మరో నూతన అప్‌డేట్‌ను (update) ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఎట్టకేలకు ‘మెసేజ్ యువర్‌సెల్ఫ్’ ( Message Yourself ) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమతో తామే చాటింగ్ చేసుకోవచ్చు. అంటే నోట్స్, రిమైండర్స్, అవసరమైన అప్‌డేట్స్‌ను పంపించుకోవచ్చు. షాపింగ్ లిస్ట్, నోట్స్, గుర్తుంచుకోవాల్సిన విషయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఫోన్‌లోని ఫొటో గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్‌లోని ఫొటోలు, వీడియోలు, ఆడియో, డాక్యుమెంట్లను నేరుగా పంపించుకోవచ్చు.

ఈ స్టెప్స్ పాటించాలి..

మీ ఫోన్‌పై యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో లేటెస్ట్ వెర్షన్ వాట్సప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

- వాట్సప్ ఓపెన్ చేయాలి.

- ఫోన్‌ స్ర్కీన్‌పై దిగువ భాగంలో కుడి మూలన ‘న్యూ చాట్ ఆప్షన్ బటన్‌’పై టాప్ చేయాలి.

- లిస్ట్ టాప్‌లో మీ కాంటాక్ట్ కనిపిస్తుంది.

- ఆ నంబర్‌ను సెలక్ట్ చేసుకుని మెసేజులు పంపించడం మొదలుపెట్టొచ్చు.

ఫోన్‌లోని ఫొటో గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్‌లోని ఫొటోలు, వీడియో, ఆడియో, డాక్యుమెంట్లను నేరుగా పంపించుకోవచ్చు. అలా చేయాలనుకుంటే కంటెంట్‌ను సెలక్ట్ చేసుకుని షేర్‌బటన్‌పై టాప్ చేయాలి. ఆ జాబితాలో వాట్సప్‌ని ఎంచుకోవాలి. కాంటాక్ట్ జాబితాలో మీ నంబర్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాగా క్రమంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్ వారాల వ్యవధిలోనే అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సప్ వెల్లడించింది.

Updated Date - 2022-11-29T18:04:37+05:30 IST