గూగుల్‌ డాక్స్‌కు కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌

ABN , First Publish Date - 2022-09-03T08:54:11+05:30 IST

అవకాశాలు ఉండటం ఒక ఎత్తయితే వాటిని చక్కగా ఉపయోగించుకోవడం మరో ఎత్తు. పని ఏదైనా స్మార్ట్‌గా జరగాలంటే ఒడుపు తెలియాలి.

గూగుల్‌ డాక్స్‌కు కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌

     అవకాశాలు ఉండటం ఒక ఎత్తయితే వాటిని చక్కగా ఉపయోగించుకోవడం మరో ఎత్తు. పని ఏదైనా స్మార్ట్‌గా జరగాలంటే ఒడుపు తెలియాలి. ఉదాహరణకు గూగుల్‌ డాక్యుమెంట్స్‌ చాలా ముఖ్యమైన వెబ్‌ ఆధారత ప్రొడక్టివిటీ టూల్‌. ఇది పూర్తిగా ఉచితం కూడా. ఈ ఆన్‌లైన్‌ వర్డ్‌ ప్రాసెసర్‌ - డాక్యుమెంట్స్‌ క్రియేషన్‌తో మొదలుకుని ఎడిట్‌ తదితర టాస్క్‌లకు పనికొస్తుంది. అనేకానేక ఫంక్షనాలిటీస్‌, కమాండ్స్‌ సమ్మిళతం ఇది. అయితే కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌తో పనిని సులువుగా చేసుకోవడమే కాదు, సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు. అవేంటంటే...


ఆల్ట్‌ + పేజీ లెఫ్ట్‌ లేదా ఆల్ట్‌ + పేజీ రైట్‌తో ఇమేజ్‌ని క్లాక్‌వైజ్‌ లేదంటే కౌంటర్‌ క్లాక్‌వైజ్‌ తిప్పుకోవచ్చు. 

కంట్రోల్‌ + షిప్ట్‌ + వి(ఇంగ్లీష్‌ అక్షరం) కలిపి నొక్కి ఫార్మేటింగ్‌ చేయకుండానే ఎలాంటి టెక్స్ట్‌నైనా పేస్ట్‌ చేసుకోవచ్చు.

కంట్రోల్‌ + షిఫ్ట్‌ + ఎస్‌ కలిపితే వాయిస్‌ టైపింగ్‌ టూల్‌ని ఉపయోగించుకోవచ్చు. ఆ కాంబినేషన్‌లో ప్రెస్‌ చేస్తే మైక్రోఫోన్‌ స్విచ్‌ ఆన్‌ అవుతుంది. తద్వారా చెప్పిన ప్రతి పదం టైప్‌ అవుతుంది. 

కంట్రోల్‌ + షిప్ట్‌ + హెచ్‌ కలిపి ప్రెస్‌ చేయడం ద్వారా డాక్యుమెంట్‌లో ఒక పదాన్ని రీప్లేస్‌ చేయవచ్చు. అయితే ఈ షార్ట్‌ కట్‌తో యావత్తు డాక్యుమెంట్‌లో ప్రతి పదాన్ని రీప్లేస్‌ చేయడం మాత్రం కుదరదు. 

కంట్రోల్‌ + షిప్ట్‌ + సి కలిపి ప్రెస్‌ చేసి డాక్యుమెంట్‌లో పదాల సంఖ్యను చెక్‌ చేసుకోవచ్చు. 

కంట్రోల్‌ + ఎఫ్‌ కలిపి ప్రెస్‌ చేయడం అవసరమైన నిర్దేశిత టెక్ట్స్‌ని సులువుగా కనుగొనవచ్చు. 

కంట్రోల్‌ + కె కలిపి ప్రెస్‌ చేయడం ద్వారా డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌ హెడ్డింగ్స్‌ సహా లింక్‌ను ఇన్‌సర్ట్‌ చేయవచ్చు. దీంతో మీరే కాకుండా ఇతరులు సైతం టెక్స్ట్‌ హెడ్డింగ్‌పై క్లిక్‌ చేసి లింక్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. 

కంట్రోల్‌ + షిప్ట్‌ + ఇ కలిపి డాక్యుమెంట్‌ మధ్యలోకి టెక్స్ట్‌ని తీసుకురావచ్చు.

టెక్ట్స్‌ని ఎడమ లేదంటే కుడివైపు తెచ్చుకునేందుకు కంట్రోల్‌, షిఫ్ట్‌, ఎల్‌/ఆర్‌ కలిపి ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. 

కంట్రోల్‌ + ఒ ప్రెస్‌ చేస్తే ఫైల్‌ ఓపెన్‌ అవుతుంది.

కంట్రోల్‌ + వై కలిపి ప్రెస్‌ చేస్తే పాత కమాండ్‌ను రిపీట్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

కంట్రోల్‌ + ఆల్ట్‌ + యు కలిపి ప్రెస్‌ చేస్తే సజెస్ట్‌డ్‌ ఎడిట్స్‌ అన్నీ అందుబాటులోకి వస్తాయి, వాటన్నింటినీ రెవ్యూ చేసుకోవచ్చు.

కంట్రోల్‌ + షిప్ట్‌ + వై కలిపితే సెలెక్ట్‌ చేసిన టెక్స్ట్‌ అర్థాన్ని తెలుసుకోవచ్చు. 

కంట్రోల్‌ + షిప్ట్‌ + ఆల్ట్‌ + ఆర్‌ కలిపితే ఒకేసారి డాక్యుమెంట్‌లో అందుబాటులో ఉన్న లైవ్‌ ఎడిట్స్‌ అన్నీ కనిపిస్తాయి.

కంట్రోల్‌ + ఆల్ట్‌ + ఎం కలిపి ప్రెస్‌ చేయడం ద్వారా మీ కామెంట్‌ను డాక్యుమెంట్‌ కు జత చేయవచ్చు. 

Updated Date - 2022-09-03T08:54:11+05:30 IST