అలెక్సాపై మనసు పారేసుకుంటున్న వినియోగదారులు.. పెరుగుతున్న వినియోగం

ABN , First Publish Date - 2022-07-30T01:31:47+05:30 IST

నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన అమెజాన్‌(amazon) అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో

అలెక్సాపై మనసు పారేసుకుంటున్న వినియోగదారులు.. పెరుగుతున్న వినియోగం

హైదరాబాద్: నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన అమెజాన్‌(amazon) అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ని ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (andhrapradesh), తెలంగాణ(telangana) రాష్ట్రాల వినియోగదారులు అలెక్సా (alexa) వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్ స్పీకర్‌లపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా ఏపీ, తెలంగాణలలో అమెజాన్ ఎకో వినియోగదారుల సంఖ్య గత రెండేళ్లలో 48 శాతం పెరిగింది. ఈ జాబితాలో హైదరాబాద్ (hyderabad) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం, గుంటూరు, మెదక్, చిత్తూరు, నెల్లూరు నగరాలు ఉన్నాయి.


 ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా జోక్స్‌, విజ్ఞానం, క్రికెట్ స్కోర్‌, స్మార్ట్ హోమ్ కంట్రోల్, షాపింగ్, ఇంకా మరెన్నో వాటిని అలెక్సానే అడుగుతున్నారు. అందుకోసమే అమెజాన్‌ కూడా ఈ సేవలను ఇంగ్లిష్, హిందీ మరియు హింగ్లీష్‌లలో అందిస్తోంది. అమెజాన్‌ ఎకో పరికరాలతో పాటు, ఇతర బ్రాండ్‌లైన ఆండ్రాయిడ్‌, ఫైర్‌ టీవీ ఎక్విప్‌మెంట్‌, అలెక్సా బిల్ట్-ఇన్ స్పీకర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు తదితర వస్తువుల కోసం అమెజాన్‌ షాపింగ్ యాప్‌లో అలెక్సాతో ఇంటరాక్ట్ అవడానికి వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. మెట్రో నగరాల్లోనే నగరాలు, పట్టణాల్లోనూ ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ స్పీకర్ల వినియోగం బాగా పెరిగింది. తమ పరికరాలు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తున్నాయని అలెక్సా-అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్.ఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలెక్సా వినియోగం పెరగడం తమకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.  

Updated Date - 2022-07-30T01:31:47+05:30 IST