స్మార్ట్ కెమెరాల్లో సెన్సర్లతో సౌలభ్యాలు
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలే గాని, ఫొటో క్లిక్ అనిపించడం ఎంతసేపు,
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలే గాని, ఫొటో క్లిక్ అనిపించడం ఎంతసేపు, క్షణాల్లో పని. అయితే మనకు తెలియంది ఒకటి ఉంది. అనేకానేక క్రియల సమ్మిళతమే మనకు ఆనందం కలిగించే ఫొటో. అందులో ఇమేజ్ సెన్సర్ కూడా ఒకటి. లెన్స్‌లతో కలగలిసి ఈ సెన్సర్లు మనకు అవసరమైన ఇమేజ్‌ని అందిస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు మంచి ఇమేజ్ అందించేందుకు డెడికేటెడ్ మోడ్స్‌తో రూపొందిస్తారు. ఇంతకీ ఏయే సెన్సర్లు ఏమి చేస్తాయో చూద్దాం.
మేక్రో సెన్సర్
ఆబ్జెక్టు ఫొటోను చాలా దగ్గర నుంచి తీసుకునేందుకు ఈ సెన్సర్ ఉపయోగపడుతుంది. మేక్రో మోడ్‌ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా సమదూరం నుంచే తీసుకోవచ్చు. ఇమేజ్‌లో వివరాన్ని స్పష్టంగా రాబట్టవచ్చు. కెమెరా లెన్స్‌ను పది సెం.మీ. దూరంలో పెట్టి తీసుకోవచ్చు. రెండు సెం.మీ. నుంచి తీసుకునే విధంగానూ కొన్ని ఉంటాయి. చాలా చిన్నపాటి క్రిములను ఫొటో తీసుకునేందుకు ఈ సెన్సర్ ఉపయోగపడుతుంది. క్లోజప్ ఇమేజ్‌లు ముఖ్యంగా ఇన్సూరెన్స్ అవసరాల కోసం ఉపయోగపడతాయి. ఉదాహరణకు నగలను ఇన్సూరెన్స్ చేసినప్పుడు వివరంగా అంటే అన్నీ ఇమేజ్‌లోకి వచ్చే విధంగా తీసుకోవచ్చు.

టైమ్ ఆఫ్ ఫ్లయిట్ (టీఓఎఫ్) సెన్సర్
ఇందులోని సెన్సర్ ఇన్‌ఫ్రారెడ్ లైట్ సమాచార లోతుని నిర్ధారిస్తుంది. కాంతి వేగాన్ని అనుసరించి దూరాన్ని లెక్కించవచ్చు. హై ఎండ్ స్మార్ట్ ఫోన్లలో దీన్ని ఉంచుతారు. దాంతో కెమెరాకు రిఫ్లెక్ట్ అయ్యే సమయాన్ని తెలుసుకోవచ్చు. ఫోకస్ కాని బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం ఈ సెన్సర్‌ను ఉపయోగిస్తారు.

డెప్త్ సెన్సర్
పేరుకు తగ్గట్టే డెప్త్‌ని కనుగొనడమే దీని ఉద్దేశం. ప్రొఫెషనల్ స్టయిల్, బ్లర్ ఎఫెక్ట్స్, ఆగ్‌మెంటెడ్ రియాల్టీ ప్రభావాల కోసం ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్లలోని ఫ్రంట్, రేర్ కెమెరాల్లో ఇది ఉంటుంది. బడ్జెట్ ఫోన్లలోనూ పొర్ట్రయిట్ మోడ్ కోసం పనికొస్తుంది. డెప్త్ ఎఫెక్ట్ కోసం ఉపయోగపడుతుంది.

టెలిఫొటో సెన్సర్
స్మార్ట్‌ఫోన్‌లో టెలిఫొటో కెమెరా ఉంటే అవసరానుగుణంగా సీన్‌ను జూమ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దూరం నుంచి ఆబ్జెక్టులను క్లిక్‌మనిపించవచ్చు. డిజిటల్ జూమ్ కంటే మెరుగైన ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇటీవలి స్మార్ట్‌ఫోన్లలోని టెలిఫొటో సెన్సర్లు ఏఐ సపోర్ట్ చేస్తాయి. ఫలితంగా స్టెబిలిటీకి తోడు శబ్దాన్ని తగ్గిస్తాయి.

లైడార్ సెన్సర్
ఐఫోన్ 12, ఐఫోన్ 13 ప్రొ మోడల్స్ లాంటివాటిలో ఈ సెన్సర్లు ఉన్నాయి. టీఓఎఫ్ సెన్సర్ మాదిరిగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఏరియల్ మేపింగ్ టెక్నాలజీల్లో ఈ సెన్సర్లు పాపులర్. మల్టిపుల్ సిగ్నల్స్ కలగలిసి సబ్జెక్టును హిట్ చేసి సెన్సర్‌ను చేరుకుంటాయి. తద్వారా మేపింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి తెస్తాయి. లో లైట్ ఫోక ్‌సకు సపోర్ట్‌కు ఉపకరిస్తుంది. ఆగ్‌మెంటెడ్ రియాల్టీ యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఇది అందించే వివరాల్లో కచ్చితత్వం ఉంటుంది.

అలా్ట్రవైడ్ సెన్సర్
వైడ్ యాంగిల్ సెల్ఫీ, షాట్స్ వంటివన్నీ అలా్ట్రవైడ్ సెన్సర్ ఫలితాలే. 90 డిగ్రీల్లోనూ దృశ్యాన్ని చక్కగా తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. కంటిచూపు మేరకు షాట్‌ను లాక్కోవచ్చు. కొన్ని సెన్సర్లు చేపకన్ను స్థాయి కలిగి ఉంటాయి. ఈ సెన్సర్లు బ్యాక్, ఫ్రంట్ కెమెరాల్లో ఉంటాయి.

మోనోక్రోమ్ సెన్సర్
మోనోక్రోమ్ లేదా బ్లాక్ అండ్ వైట్ షాట్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌లను షార్ప్‌గా తీసుకోవచ్చు. ఇటీవలి కాలంలో వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో నార్మల్ కలర్ సెన్సర్ నుంచి షార్ప్‌నె్‌సను పొందే సౌలభ్యం అంటే బ్లాక్ అండ్ వైట్‌లో అల్టిమేట్ ఇమేజ్‌లను పొందవచ్చు.
