కంటెంట్ తొలగింపు అరవై వేలకు పైమాటే
ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST
గూగుల్ ఒక్క నవంబరు నెలలోనే 61,114 కంటెంట్ పీసులను తొలగించింది. ఇవన్నీ మన దేశానికి సంబంధించినవే. 26,087 ఫిర్యాదులకు స్పందించి గూగుల్ ఈ చర్య తీసుకుంది...
గూగుల్ ఒక్క నవంబరు నెలలోనే 61,114 కంటెంట్ పీసులను తొలగించింది. ఇవన్నీ మన దేశానికి సంబంధించినవే. 26,087 ఫిర్యాదులకు స్పందించి గూగుల్ ఈ చర్య తీసుకుంది. వీటికి తోడు ఆటోమేటిక్ డిటెక్షన్ కింద మరో 3,75,468 కంటెంట్ పీసులను కూడా తీసేసింది. అక్టోబరులో ఫిర్యాదులు 24,569 కాగా తొలగించిన కంటెంట్ పీసులు 48,594. ఆటోమేటిక్ డిటెక్షన్ పరిధిలో మరో 3,84,509 పీసులను తీసేసింది. మూడో పార్టీ కంటెంట్‌పై ఫిర్యాదులు రాగా, స్థానిక చట్టాలను అనుసరించి లేనందున వాటిని తొలగించినట్టు గూగుల్ ఒక నివేదికలో వివరించింది. మేధా సంపత్తి హక్కులు ఉల్లంఘించారంటూ కొన్ని, పరువునష్టం తదితరాల పేరిట మరికొన్ని ఫిర్యాదులు అందాయి. ఏడు కేటగిరీల కింద ఫిర్యాదులను విభజించి, హద్దు మీరిన కంటెంట్‌ను తొలగించారు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించిన యావత్తు కంటెంట్‌ను తొలగిస్తామని గూగుల్ ఈ సందర్భంలో తెలిపింది.