South Africa VS Pakistan : ఓడితే.. పాక్‌ ఇంటికే

ABN , First Publish Date - 2022-11-03T05:25:40+05:30 IST

ప్రపంచకప్‌ గ్రూప్‌-2లో ఆసక్తికరమైన మ్యాచ్‌ గురువారం జరగబోతోంది. దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవకుంటే ఇంటిదారి పట్టాల్సిన

 South Africa VS Pakistan : ఓడితే.. పాక్‌ ఇంటికే
South Africa VS Pakistan

సఫారీలతో కీలకపోరు నేడు

సిడ్నీ: ప్రపంచకప్‌ గ్రూప్‌-2లో ఆసక్తికరమైన మ్యాచ్‌ గురువారం జరగబోతోంది. దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవకుంటే ఇంటిదారి పట్టాల్సిన సంక్లిష్ట పరిస్థితుల్లో పాకిస్థాన్‌ ఉంది. ఒకవేళ సఫారీలు గెలిస్తే 7 పాయింట్లతో ఆ జట్టుకు సెమీ స్‌ బెర్తు ఖరారవుతుంది. కాగా, టాపార్డర్‌ బ్యాటర్‌ పఖర్‌ జమాన్‌ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఇక సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్పించకపోతే పరుగుల పండుగకు అవకాశముంది. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకోవచ్చు. ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. మ్యాచ్‌ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో గాలిలో తేమ 70 శాతం వరకూ ఉండవచ్చని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది.

Updated Date - 2022-11-03T05:25:42+05:30 IST