ధవన్‌కు పంజాబ్‌ పగ్గాలు

ABN , First Publish Date - 2022-11-03T05:32:33+05:30 IST

వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ వ్యవహరిస్తాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా జట్టు

ధవన్‌కు పంజాబ్‌ పగ్గాలు

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ వ్యవహరిస్తాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా జట్టు సారథిగా ఉన్న మయాంక్‌ అగర్వాల్‌కు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో ధవన్‌కు పగ్గాలు అప్పగించారు. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లడంతో అతని బదులు మయాంక్‌ను పంజాబ్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-11-03T05:32:35+05:30 IST