Bangladesh vs India 2nd ODI : బంగ్లాను నిలువరిస్తారా?
ABN , First Publish Date - 2022-12-07T00:53:51+05:30 IST
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత జట్టు బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితిలోనూ
గెలుపే ధ్యేయంగా టీమిండియా
నేడు రెండో వన్డే
ఉదయం 11.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత జట్టు బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితిలోనూ నెగ్గి తీరాల్సిందే. లేకుంటే ఇక్కడ వరుసగా రెండు వన్డే సిరీ్‌సలను కోల్పోయినట్టవుతుంది. అదే జరిగితే ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపయినట్టే. స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టు ఎంత ప్రమాదకరమో రోహిత్ సేనకు ఈపాటికే తెలిసొచ్చింది. ఆఖరి వికెట్‌కు 51 పరుగులు జోడించిన తీరు వారి పట్టుదలను చాటింది. అయితే ఓ దశలో 104 బంతులపాటు ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడం వారి బ్యాటింగ్ తీరుపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. అయితే ముస్తాఫిజుర్, షకీబల్, ఎబాదత్ హొస్సేన్‌లతో కూడిన బౌలింగ్ లైనప్ మాత్రం పటిష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితేనే భారత జట్టు ఈ మ్యాచ్‌లో గట్టెక్కుతుంది.
టాపార్డర్ వైఫల్యంతో ఆందోళన: స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో పూర్తి ఓవర్లను కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా టాపార్డర్‌లో రోహిత్, ధవన్, కోహ్లీ విఫలం కావడం దెబ్బతీసింది. కీలకమైన నేటి మ్యాచ్‌లో వీరు బ్యాట్లు ఝుళిపించాల్సిందే. అలాగే బ్యాటర్స్ కూడా నిర్లక్ష్యపు షాట్లకు అవుటై పెవిలియన్‌కు చేరారు. స్పిన్నర్లు షకీబల్, ఎబాదత్ మధ్య ఓవర్లలో విరుచుకుపడి జట్టును చుట్టేశారు. కేఎల్ రాహుల్ పోరాటం లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. వన్డే వరల్డ్‌క్‌పనకు ఇంకా పది నెలల సమయమే ఉన్నప్పటికీ భారత్ ఆటతీరు ఎలా ఉండాలనే విషయమై స్పష్టత లేదు. తొలి మ్యాచ్‌లో దాదాపు 150 డాట్ బాల్స్ ఉండడం ఆందోళన కలిగించేదే. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌లను ఈ సిరీస్ నుంచి తప్పించడం విమర్శలకు దారితీసింది. ఇక జట్టుతో పాటే ఉన్న యువ ఆటగాళ్లు రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠిలను ఎలా ఉపయోగించుకుంటారనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. తొలి వన్డేలో నలుగురు ఆల్‌రౌండర్లలో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది. డెత్ ఓవర్లలో బౌలర్లు చివరి వికెట్ తీయలేక అష్టకష్టాలు పడ్డారు. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉంటే షాబాజ్ స్థానంలో ఆడించవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, సుందర్, షాబాజ్/అక్షర్, శార్దూల్, చాహర్, సిరాజ్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్: షంటో, లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్, షకీబల్, ముఫ్ఫికర్, మహ్ముదుల్లా, ఆఫిఫ్, మెహిదీ హసన్, మహ్మూద్, ముస్తాఫిజుర్, ఎబాదత్.