Lionel Messi : ఫిఫా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-12-19T06:30:50+05:30 IST

ఫిఫా ప్రపంచకప్ సాధించిన తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సీ తాజాగా సంచలన ప్రకటన ...

Lionel Messi : ఫిఫా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన
Lionel Messi

దోహా(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ సాధించిన తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సీ తాజాగా సంచలన ప్రకటన జారీ చేశారు.అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్ తర్వాత అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సీ తాజా వ్యాఖ్యలు చేశారు.(FIFA World Cup)‘‘నేను జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి రిటైర్ కావడం లేదు. అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్ ఆడాలని కోరుకుంటున్నాను’’ అని మెస్సీ వెల్లడించారు. (World Cup champions with Argentina)దీంతో అర్జెంటీనా కెప్టెన్ మరో ప్రపంచ కప్ ఆడకపోవచ్చు,కాని అతను రాబోయే అమెరికాలో కోపా లా అల్బిసెలెస్టేకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందని క్రీడాకారులు చెపుతున్నారు.

‘‘ఇది కేవలం నమ్మశక్యం కాదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు, ఇది మాకు చాలా సంతోషం కలిగించింది’’ అని మెస్సీ అన్నారు.చివరకు ప్రపంచ కప్‌ను( FIFA World Cup) గెలుచుకున్న తర్వాత లియోనెల్ మెస్సీ సాకర్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచారు.

Updated Date - 2022-12-19T07:39:59+05:30 IST