India vs Kiwis ;సెమీస్‌ రద్దయితే.. ఫైనల్లో భారత్‌ X కివీస్‌

ABN , First Publish Date - 2022-11-09T05:18:36+05:30 IST

వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అయితే ఈ ప్రపంచక్‌పలో ఇప్పటికే వర్షంతో పలు మ్యాచ్‌లు

India vs Kiwis ;సెమీస్‌ రద్దయితే.. ఫైనల్లో భారత్‌ X కివీస్‌

సిడ్నీ: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అయితే ఈ ప్రపంచక్‌పలో ఇప్పటికే వర్షంతో పలు మ్యాచ్‌లు రద్దవడం లేదా కొన్ని మ్యాచ్‌లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ద్వారా ఫలితం తేలడం చూశాం. ఇక సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు రద్దయితే ఏమిటన్నది పరిశీలిద్దాం. రెండు సెమీఫైనల్స్‌, ఫైనల్‌కు ఒక్కోరోజు రిజర్వ్‌డే ఇచ్చారు. రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్‌లు సాధ్యపడకపోతే గ్రూప్‌ టాపర్లుగా నిలిచిన జట్లను సెమీస్‌ విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుతాయన్నమాట. ఫైనల్‌ కూడా రిజర్వ్‌డేనాడు సాధ్యం కాకపోతే ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో మ్యాచ్‌ ఫలితం తేలాలంటే..కనీసం 10 ఓవర్లయినా జరగాలి. లీగ్‌ మ్యాచ్‌ల్లో ఇది 5 ఓవర్లుగానే ఉంది.

Updated Date - 2022-11-09T05:18:38+05:30 IST