ఫైనల్లో లవ్లీనా, అల్ఫియా

ABN , First Publish Date - 2022-11-10T05:44:43+05:30 IST

ఆసియా ఎలిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ లవ్లీనా బోర్గోహైన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి పసిడి

ఫైనల్లో లవ్లీనా, అల్ఫియా

ఆసియా బాక్సింగ్‌

న్యూఢిల్లీ: ఆసియా ఎలిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ లవ్లీనా బోర్గోహైన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి పసిడి పంచ్‌కు అడుగుదూరంలో నిలిచింది. జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో బుధవారం జరిగిన మహిళల 75 కిలోల విభాగం సెమీఫైనల్‌ బౌట్‌లో లవ్లీనా 5-0తో దక్షిణ కొరియా బాక్సర్‌ సుయెన్‌ను ఓడించింది. మరో భారత అమ్మాయి అల్ఫియా పఠాన్‌ (81+) కూడా తన విభాగంలో ఫైనల్‌ చేరి సత్తాచాటింది. సెమీస్‌లో అల్ఫియా 5-0తో లజ్జాట్‌ (కజకిస్థాన్‌)పై గెలిచింది. ఇక, సెమీస్‌లో అంకుషిత బోరో (66 కిలోలు) 1-4తో నవ్‌బఖోర్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Updated Date - 2022-11-10T05:44:43+05:30 IST

Read more