స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. నలుగురు స్నేహితులతో కలిసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-18T23:17:28+05:30 IST

ఆ యువకుడు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికతో స్నేహం చేశాడు.. ఆ బాలిక ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కలిసేవాడు..

స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. నలుగురు స్నేహితులతో కలిసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. చివరకు..

ఆ యువకుడు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికతో స్నేహం చేశాడు.. ఆ బాలిక ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కలిసేవాడు.. ఆమెతో మాట్లాడుతూ వెళ్లేవాడు.. క్రమంగా ఆ యువకుడిని ఆ బాలిక నమ్మేసింది.. రెండు నెలల క్రితం ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆ యువకుడు తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు.. అక్కడ ఉన్న తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: భార్య ప్రవర్తనతో విసిగిపోయి మామగారి ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ తర్వాత..


జైపూర్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు అర్పిత్ కుమావత్ (21)ను కర్ధాని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తన నలుగురు స్నేహితులతో కలిసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదిరిస్తే చంపేస్తామని ఆ బాలికను బెదిరించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. 16 ఏళ్ల బాధితురాలితో స్నేహం చేసిన అర్పిత్ ఆమెను మాయ మాటలతో ఆకట్టుకుని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. ఆ ఘటన గురించి ఎవరికైనా చెబితే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని ఆ బాలికను అర్పిత్ బెదిరించాడు. దీంతో ఆ బాలిక సైలెంట్‌గా ఉండిపోయింది. చివరకు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Read more