పెళ్లైన ఏడాదికే యువకుడి ఆత్మహత్య.. చనిపోయే ముందు అతను చెప్పిన విషయాలు ఏంటంటే..
ABN , First Publish Date - 2022-06-03T21:26:47+05:30 IST
ఆ యువకుడికి ఏడాది కిందట వివాహం జరిగింది.. ఎంతో ఇష్టపడిన భార్యతో వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోతుందని ఆశలు పెట్టుకున్నాడు..

ఆ యువకుడికి ఏడాది కిందట వివాహం జరిగింది.. ఎంతో ఇష్టపడిన భార్యతో వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోతుందని ఆశలు పెట్టుకున్నాడు.. అయితే అతని ఆశలు అడియాశలయ్యాయి.. పెళ్లయ్యాక అతనికి కష్టాలు మొదలయ్యాయి.. భార్యతో పాటు అత్తమామలు కూడా అతడిని వేధించడం మొదలుపెట్టారు.. అత్తమామలు అతడిపై దాడి కూడా చేశారు.. భార్య కాపురానికి రాకుండా ఏడిపించింది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఇది కూడా చదవండి..
భర్త, కూతురిని వదిలి తనతో వచ్చెయ్యమని మాజీ ప్రియుడి బెదిరింపులు.. ఆమె అతని మాట వినకపోవడంతో ఏం చేశాడంటే..
హర్యానాలోని పానిపట్‌కు చెందిన అబ్దుల్ బారిక్ (24) అనే యువకుడికి గతేడాది జైనాల్ అనే యువతితో వివాహం జరిగింది. అయితే జైనాల్ను ఆమె తల్లిదండ్రులు కాపురానికి పంపించలేదు. అబ్దుల్నే తమ ఇంటికి వచ్చెయ్యాలని ఒత్తిడి చేసేవారు. అబ్దుల్ వారంలో కొన్ని రోజులు తన ఇంట్లోనూ, కొన్ని రోజులు అత్తింట్లోనూ ఉండేవాడు. జైనాల్ తన తల్లిదండ్రుల మాట తప్ప భర్త మాట వినేది కాదు. జైనాల్ను అబ్దుల్ ఎప్పుడైనా తిడితే ఆమె తల్లిదండ్రులు రంగ ప్రవేశం చేసేవారు. అబ్దుల్‌ను కొట్టేవారు.
అత్తింటి వారి తీరుతో విసిగిపోయిన అబ్దుల్ వారి ఇంటికి వెళ్లడం మానేశాడు. భార్యను కాపురానికి రమ్మని అడిగాడు. అయితే అబ్దుల్ ఇంటికి రావడానికి జైనాల్ అంగీకరించలేదు. పైగా, భర్త గృహ హింసకు పాల్పడుతున్నాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అబ్దుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన వాంగ్మూలాన్ని మొబైల్లో రికార్డు చేశాడు. తన చావుకు తన భార్య, అత్తామామలు కారణమని, వారికి కచ్చితంగా శిక్ష పడాలని చెప్పాడు. అబ్దుల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.