25 ఏళ్ల యువతి ఇంట్లోనే బలవన్మరణం.. ఆమె ఫోన్లోని వీడియోలతో అసలేం జరిగిందో బయటపెట్టిన పోలీసులు..!
ABN , First Publish Date - 2022-06-24T17:17:42+05:30 IST
ఆమెకు 25ఏళ్లు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో ఉన్న ఆమె.. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దారుణానికి పాల్పడింది. తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని ఆ

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 25ఏళ్లు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో ఉన్న ఆమె.. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దారుణానికి పాల్పడింది. తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను ఫోన్ పరిశీలించిన అధికారులు.. అందులోని వీడియోల ఆధారంగా యువతి మరణానికి గల కారణాన్ని గుర్తించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌లోని వడోదరకు చెందిన నసీఫా.. నూర్జహాన్ పార్క్ సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. తాజాగా ఆమె దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె ఫోన్‌ను పరిశీలించారు. అందులోని వీడియోల ఆధారంగా ఆమె మరణానికి గల కారణాలను పోలీసులు గుర్తించారు. అహ్మదాబాద్‌కు చెందిన షేక్ రమీజ్ అనే యువకుడిని నసీఫా ప్రేమించిందని.. అతడు కూడా ఆమెను ప్రేమించినట్టు అధికారులు కనుగొన్నారు. అయితే.. తొలుత పెళ్లికి ఒప్పుకున్న అతడు.. ఆ తర్వాత మాట మార్చాడని.. నసీఫా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని వీడియోల ఆధారంగా బయటపడింది. దీంతో ఆమె మనస్తాపం చెంది.. ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు ముందు రమీజ్.. చేసిన మోసం గురించి బయటపెడుతూ.. అతడి కారణంగా చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు నసీఫా వీడియో రికార్డు చేయడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నసీఫాను నమ్మించి మోసం చేసినందుకుగాను.. అతడిపై కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని అధికారులు వెల్లడించారు.
