బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా రోడ్డు మీదకు వచ్చిన ఆవు.. దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు కానీ.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-19T23:16:20+05:30 IST

ప్రయాణాల సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒక్కోసారి ఒకరి నిర్లక్ష్యం ఎదుటి వారి ప్రాణాల మీదకు వస్తుంటుంది. మరికొన్ని సార్లు పశువుల కారణంగా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో...

బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా రోడ్డు మీదకు వచ్చిన ఆవు.. దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు కానీ.. చివరకు..

ప్రయాణాల సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒక్కోసారి ఒకరి నిర్లక్ష్యం ఎదుటి వారి ప్రాణాల మీదకు వస్తుంటుంది. మరికొన్ని సార్లు పశువుల కారణంగా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు బైకుపై వెళ్తుండగా, అనుకోని ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా ఓ ఆవు రోడ్డు మీదకు రావడంతో... దాన్ని తప్పించే ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నమే అతడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా భలేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బుచ్చవాస్‌కు చెందిన సందీప్ (28) భలేరి ఆస్పత్రిలో కాంట్రాక్టు కంప్యూటర్ డేటా ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రోజూ మాదిరే ఆదివారం కూడా విధులు ముగించుకుని, బైకుపై ఇంటికి బయలుదేరాడు. భలేరి, బుచ్చవాస్ ప్రాంతాల మధ్య రోడ్డు పైకి సడన్‌గా ఓ ఆవుల మంద వచ్చింది. అందులో ఓ ఆవును తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!


గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని భలేరి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చురుకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టమార్టం నిర్వహించి, సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవతో.. వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. Ice cream కోసం యువకుడి బైక్‌లో వెళ్లామంటూ చెప్పుకొచ్చిన చెల్లెలు..Updated Date - 2022-07-19T23:16:20+05:30 IST