అర్ధారాత్రి ఇంట్లోకి దూరి.. నిద్రపోతున్న ఈ యువతిపై పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడో యువకుడు.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-10-07T19:18:29+05:30 IST

అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రపోతున్న యువతిపై పెట్రోల్ పోసీ మరీ నిప్పంటించాడో వ్యక్తి. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోం

అర్ధారాత్రి ఇంట్లోకి దూరి.. నిద్రపోతున్న ఈ యువతిపై పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడో యువకుడు.. ఇంతకీ అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రపోతున్న యువతిపై పెట్రోల్ పోసీ మరీ నిప్పంటించాడో వ్యక్తి. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాగా.. ఇంతకూ ఈ దారుణం ఎక్కడ చోటు చేసుకుంది? యువతిపై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


ఆ యువతి పేరు మారుతీ కుమారి. జార్ఖండ్‌లోని జార్ముండి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న భరత్‌పూర్ అనే గ్రామంలో ఆమె నివసిస్తోంది. ఈ యువతికి అదే ప్రాంతానికి చెందిన రాజేష్ రౌత్ అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే.. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజేష్‌కు మరో యువతితో వివాహం జరిగింది. దీంతో మారుతీ కుమారి తల్లిదండ్రులు కూడా తమ కూతురు కోసం సంబంధాలు చూడటం ప్రారంభించారు. అయితే.. పెళ్లైనప్పటికీ రాజేష్ మాత్రం మారుతీ కుమారీ వెంట పడుతూనే ఉన్నాడు. రెండో పెళ్లి చేసుకుంటానంటూ విసిగిస్తూ ఉన్నాడు. అయితే.. దానికి ఆ యువతి మాత్రం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా అర్ధరాత్రి వేళ మారుతీ కుమారి ఇంట్లోకి చొరబడ్డ అతడు.. నిద్రపోతున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. యువతి అరుపులతో తల్లిదండ్రులు సహా స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో యువతిని రాంచీలోని రిమ్స్‌లో అడ్మిట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మారుతీ కుమారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజేష్‌పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Read more