ఉక్కు కత్తితో చెక్క కత్తికి పోటీ.. 3 రెట్ల పదునుతో ఏది గెలిచిందంటే..

ABN , First Publish Date - 2022-04-19T16:09:47+05:30 IST

ఉక్కు కత్తితో చెక్క కత్తికి పోటీ.. 3 రెట్ల పదునుతో ఏది గెలిచిందంటే..

ఉక్కు కత్తితో చెక్క కత్తికి పోటీ.. 3 రెట్ల పదునుతో ఏది గెలిచిందంటే..

మటన్ కోయడం దగ్గర్నుంచి కూరగాయలు కట్ చేయడం వరకు అన్ని పనులు ఈ చెక్క కత్తితో చేస్తారని చెబితే అది జోక్‌ అనుకుంటారు. కానీ ఇది నిజం. ఉక్కు కంటే 3 రెట్లు ఎక్కువ పదును కలిగిన చెక్క కత్తిని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఈ కత్తిని తయారు చేసిన మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టెంగ్ లీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత ద్వారా సాధారణ కలపను గట్టి చెక్కగా మార్చవచ్చు. ఈ కొత్త కత్తి దీనికి ఉదాహరణ. ఇతర కత్తుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనది. 


ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపిన వివరాల ప్రకారం, బాస్‌వుడ్ మృదువైన కలపగా గుర్తించారు. ఈ కలపను సంగీత వాయిద్యాలు వంటి అనేక వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కలపను ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా గట్టిపడేలా చేస్తారు. దానితో పదునైన కత్తులను కూడా తయారు చేయవచ్చు. చెక్కను పదునైన కత్తిగా మార్చేందుకు, ముందుగా కలపను ప్రత్యేక రసాయనంలో నానబెడతారు. దీని తరువాత నీటితో శుభ్రం చేసి. దానిపై వేడి ఒత్తిడిని ఇస్తారు. ఈ ప్రక్రియతో అది నీరు పడినా కూడా ఏ విధంగానూ మార్పు చెందకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఆ కలపకు కత్తి ఆకారంతో పాటు పదునైన అంచును తీర్చిదిద్దుతారు. ఎన్వైటీ నివేదిక ప్రకారం ఈ కత్తిని కడగవచ్చు. ఇది డస్ట్ రెసిస్టెంట్ కూడా. ఇతర చెక్కల వలె దుమ్ము దీనికి అంటుకోదు. ఈ కత్తి అంచు పదును తగ్గితే దానిని సాధారణ కత్తిలా పదును పెట్టవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు ఈ కత్తిని సాధారణ చెక్కతో తయారు చేశారు. ఇది సాధారణ కత్తికంటే 23 రెట్లు గట్టిదని వారు తెలిపారు.

Updated Date - 2022-04-19T16:09:47+05:30 IST