Angel Priya పేరుతో ఫేక్ అకౌంట్‌.. భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందో భార్య.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-11-30T15:19:25+05:30 IST

ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతడితో చాటింగ్ చేసింది.

Angel Priya పేరుతో ఫేక్ అకౌంట్‌.. భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందో భార్య.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!

ఫేస్‌బుక్‌లో ఏంజిల్ అనే పేరుతో చాలా అకౌంట్లు ఉంటాయి. ఇలాంటివన్నీ దాదాపు ఫేక్ అకౌంట్స్ అనే చెప్పవచ్చు. కొందరు సరదాగా సోషల్ మీడియా కోసం ఇలాంటి అకౌంట్‌లను ఉపయోగిస్తే మరికొందరు ఆ అకౌంట్స్‌తో తమకు తెలిసిన వారిని ట్రాప్ చేస్తుంటారు. ఓ మహిళ కూడా ఇలాగే ఏంజిల్ ప్రియ అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. దాన్నుండి ఆమె తన భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. అతడితో చాటింగ్ చేసింది. భార్య ఇలా చేస్తోందని తెలియని అతడు ఆమెతో ప్రవర్తించిన విధానం చాలా షాకింగ్‌గా ఉందట. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇండోర్‌కు చెందిన ఓ మహిళకు తనకంటే వయసులో పదేళ్ళు పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు అతడిని పెళ్ళి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా అతడికి తన తండ్రి మరణం తరువాత కారుణ్య నియమాకం క్రింద ఉద్యోగం ఇచ్చారని, ఉద్యోగం ఉన్నవాడితో జీవితం బాగుంటుందని కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. వారి బలవంతం కారణంగా ఇష్టం లేకపోయినా అతడిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందామెకు. పెళ్ళి తరువాత ఆమె జీవితం దారుణంగా తయారయ్యింది. అతడు ఎప్పుడూ ఆమెను కొట్టడం, హింసించడం చేసేవాడు. మత్తుపదార్థాలు ఇవ్వడం, తాగించడం వంటివి చేసేవాడు. ఆమె అడ్డుకుంటే చావగొట్టేవాడు. దీంతో ఆమె మూడేళ్ళ క్రితమే అతన్నుండి విడిపోయి అతడి మీద వేధింపుల కేసు పెట్టింది.

అప్పటికే ఆమెకు అతడి వల్ల ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే ఆ పిల్లావాడిని అతడు తన వద్దే ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు కొడుకును చూసుకోవడానికి కూడా ఆమెకు అతడు అవకాశం ఇవ్వడం లేదు. ఆమె అతడి నుండి వేరుగా ఉంటున్న కారణంగా మెయింటెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ ఆమెకు ఏమీ అందడం లేదట. కేసు పెట్టినా ఏమీ ఫలితం లేకపోయేసరికి ఆమె ఒక ఫేక్ ఐడితో ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. దీంతో అతడు కూడా ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసాడు. ఆమె అతడితో చాటింగ్ చేస్తోంటే అతడు చాలా అసభ్యంగా రిప్లై ఇవ్వడమే కాకుండా మాటల్లోపడి అతడు తన అసలు వయసును చెప్పేశాడు. దీంతో.. పెళ్లి సమయంలో పెదేళ్లు మాత్రమే పెద్ద అని చెప్పినా.. అతడి వయసు తన కంటే 15ఏళ్ళు ఎక్కువ అనే విషయం తెలిసి ఆమె విస్తుపోయింది. అతడితో చేసిన చాటింగ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్లు తీసి.. ఇదీ అతడి భాగోతం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. ఎలాంటి ఆర్థిక సహాయం చెయ్యకుండా, కనీసం కన్నకొడుకును చూసుకోనివ్వకుండా చేస్తున్న అతడి నుండి ఆమెకు సరైన న్యాయం జరిగితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-11-30T15:19:27+05:30 IST