పురుషుల కంటే స్త్రీల మెదడు ఎంతో చురుకు... శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు!

ABN , First Publish Date - 2022-03-06T15:54:30+05:30 IST

శాస్త్రవేత్తల పరిశోధనల్లో పురుషుల కంటే...

పురుషుల కంటే స్త్రీల మెదడు ఎంతో చురుకు... శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు!

శాస్త్రవేత్తల పరిశోధనల్లో పురుషుల కంటే మహిళల మెదడు చాలా చురుకుగా ఉంటుంటుందని వెల్లడయ్యింది.  ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి తదితర రుగ్మతలకు మహిళలు ఎందుకు ఎక్కువగా గురవుతున్నారో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు ఒక ప్రత్యేక రకం సీటీ స్కాన్‌ను ఉపయోగించారు. కాలిఫోర్నియాలోని అమెన్ క్లినిక్‌ శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం.. ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద బ్రెయిన్ ఇమేజింగ్ సర్వే. వారు తొమ్మిది క్లినిక్‌ల నుండి 46,000 కంటే ఎక్కువ మెదడు స్కాన్‌లను పరిశోధించారు. పురుషులు- స్త్రీల మధ్య మెదడు వ్యత్యాసాలను విశ్లేషించారు. న్యూరోలాజికల్ డిజార్డర్స్.. పురుషులను, స్త్రీలను వేర్వేరుగా ఎలా ప్రభావితం చేస్తాయో ఇది తెలియజేసింది. పురుషుల కంటే స్త్రీల మెదళ్ళు ఎందుకు ఎక్కువ చురుకుగా ఉంటాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు కొన్ని పాయింట్ల ద్వారా తెలియజేశారు.

1. స్త్రీల మెదళ్ళు పురుషుల కంటే చాలా చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు రెండు విభాగాలలో అంటే.. ప్రిఫ్రంటల్ కార్టెక్స్, ఫోకస్ ఇంపల్స్ కంట్రోల్‌తో సంబంధం కలిగి ఉంటుందని తేలింది. లింబిక్ వ్యవస్థ మూడ్, ఆందోళనతో సంబంధాన్ని కలిగివుంటుంది

2. పురుషులలో మరింత చురుకుగా ఉండే మెదడు భాగాలు ఉన్నాయి. అవి దృశ్య భాగం, సమన్వయ కేంద్రం.

3. SPECT (సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ) టెక్నాలజీ ద్వారా మెదడులో రక్తం ఎలా ప్రవహిస్తుందో గుర్తించవచ్చు.


4. పురుషులతో పోలిస్తే, ఆరోగ్యకరమైన స్త్రీల మెదడులో గణనీయమైన మార్పు లేదు (p <0.01) కానీ ROI (ఆసక్తి ప్రాంతం) 65 బేస్‌లైన్. 48 ఏకాగ్రత ప్రాంతాలలో (p <0.01 సరైనది) పెరిగింది. ఈ కారణంగా మహిళలు ఏదైనా పనిని ఏకాగ్రతతో, ఆసక్తిగా చేస్తారని తేలింది. 

5. క్లినికల్ గ్రూప్‌లో స్త్రీల మెదడులో ప్రిఫ్రంటల్, లింబిక్ ప్రాంతాలలో ప్రత్యేకంగా విస్తరించినట్లు కనుగొన్నారు. దిగువ ఆక్సిపిటల్ లోబ్స్, ఇన్ఫీరియర్ టెంపోరల్ లోబ్స్, లోబుల్ 7 సెరెబెల్లమ్ (సెరెబెల్లమ్) క్రస్ 2 మగవారిలో గణనీయంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు.

6. స్త్రీలలో అల్జీమర్స్ వ్యాధి, డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్‌లను అభివృద్ధి చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పురుషుల కంటే స్త్రీలు ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌కు ఎక్కువ రక్త ప్రసరణను కలిగి ఉంటారు. ఈ కారణాల వల్ల స్త్రీలలో స్వీయ నియంత్రణ, శ్రద్ధ చూపడం తదితర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

7. ఒక పరిశోధన ప్రకారం కూడా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమని వెల్లడయ్యింది. స్త్రీలు రాత్రిపూట 20 నిమిషాలు అధికంగా నిద్రపోవాలి. తద్వారా వారు తిరిగి ఉత్సాహంగా కనిపిస్తారు.

8. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు 2016లో జరిపిన అధ్యయనంలో కూడా మెదడు శక్తిని పునరుద్ధరించడానికి మహిళలు ఎక్కువసేపు నిద్రపోవాలని కనుగొన్నారు. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, పురుషుల కంటే స్త్రీలకు మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థలో ఎక్కువ రక్త ప్రవాహం ఉందని, ఈ కారణంగా స్త్రీల మెదడు పురుషుల కంటే చురుకుగా ఉంటుందని వెల్లడయ్యింది. 


Updated Date - 2022-03-06T15:54:30+05:30 IST