ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-22T03:24:08+05:30 IST

కొందరు చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తీసుకునే నిర్ణయాల వెనుక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా చాలా..

ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

కొందరు చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తీసుకునే నిర్ణయాల వెనుక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. తనకు ఒక్క రోజు సెలవు కావాలని తన బాస్‌ను అడిగింది. అయితే అందుకు అతను ఒప్పుకోకపోవడంతో.. లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే చివరకు ఆమె సమస్య తెలుసుకున్న నెటిజన్లు.. శభాష్ అంటూ మహిళను అభినందిస్తున్నారు.


కొందరు కుక్కలను కూడా తమ సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటుంటారు. మరికొందరు వివిధ జాతులకు చెందిన కుక్కలను లక్షలు ఖర్చు చేసి కొంటుంటారు. వాటికి ఏమాత్రం అనారోగ్యం కలిగినా భరించలేరు. వాటికి ఆపద వస్తుందని అనుకుంటే ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ప్రస్తుతం ఓ మహిళ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేగాన్ మార్షల్ అనే మహిళ.. 15 సంవత్సరాలకు పైగా ఓ కుక్కను పెంచుకుంటోంది.  ఆ కుక్క అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇటీవల కుక్కకు ఆరోగ్యం క్షీణించింది.

Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..


వైద్యం చేయించినా ఫలితం లేక చివరకు ఇటీవల కుక్క చనిపోయింది. దీంతో ఆమె ఎంతో బాధపడింది. ఇదే విషయాన్ని తన బాస్‌కు తెలియజేసి, సెలవు కావాలని అడిగింది. ఇంత చిన్న కారణానికి సెలవు కావాలా.. అంటూ ఆమె బాస్ తిరస్కరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహిళ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు.

భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే..Updated Date - 2022-07-22T03:24:08+05:30 IST