పెళ్లయి ఏడేళ్లు అయినా ఈ 23 ఏళ్ల మహిళకు కలగని సంతానం.. భర్త తీరుతో భరించలేక ఆమె చేసిన పనితో చివరకు ఇలా ఆస్పత్రిలో..

ABN , First Publish Date - 2022-06-16T21:43:02+05:30 IST

ఆమె వయసు 23 ఏళ్లు.. ఏడేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది.. అయితే ఆమెకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు..

పెళ్లయి ఏడేళ్లు అయినా ఈ 23 ఏళ్ల మహిళకు కలగని సంతానం.. భర్త తీరుతో  భరించలేక ఆమె చేసిన పనితో చివరకు ఇలా ఆస్పత్రిలో..

ఆమె వయసు 23 ఏళ్లు.. ఏడేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది.. అయితే ఆమెకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు.. దీంతో ఆమెకు అత్తింటి వారి తరఫు నుంచి వేధింపులు మొదలయ్యాయి.. బంధువులందరి ముందు ఆమెను అవమానించేవారు.. భర్త కూడా కిరాతకంగా ప్రవర్తించేవాడు.. ఈ అవమానాలను భరించలేకపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.. మేడ మీద నుంచి దూకేసింది.. ప్రస్తుతం తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

నా కూతుర్ని చంపేశానంటూ ఓ తల్లి ఫోన్‌కాల్.. పోలీసులు వెళ్లేసరికి ఇంట్లో షాకింగ్ సీన్.. అసలు కారణమేంటో తెలిసి..


`పెళ్లై ఏడేళ్లైనా నాకు పిల్లలు పుట్టలేదు. మా అత్తగారు నన్ను తరచుగా గేలి చేస్తుంటుంది. తప్పుడు ఆరోపణలు చేస్తుంది. నా భర్త కూడా తల్లికే వత్తాసు పలుకుతాడు. కొన్ని రోజులుగా అత్తగారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. నన్ను ఇల్లు విడిచిపెట్టి వెళ్లమంటున్నారు. నా భర్తకు మళ్లీ పెళ్లి చేస్తామంటున్నారు. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లగలను? అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. విషం తాగేసి మేడ ఎక్కి అక్కడి నుంచి దూకేశాన`ని చెప్పింది. అయితే ఆమె ఆరోపణలను భర్త ఖండించాడు. అతను కూడా ఆమెపై ఆరోపణలు చేస్తున్నాడు. 


`నా భార్య క్యారెక్టర్ మంచిది కాదు. ఆమెకు మా ఊరిలో చాలా మందితో వివాహేతర సంబంధాలున్నాయి. ఆమె ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా నేను సహిస్తూనే ఉన్నా. నన్ను, మా అమ్మను కేసులో ఇరికించి జైలుకు పంపాలని చూస్తోంద`ని అతను చెబుతున్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-06-16T21:43:02+05:30 IST