నా వాట్సప్, ఫేస్‌బుక్ చాటింగ్‌ను భర్త చదువుతున్నాడంటూ కేసు పెట్టిన భార్య.. ఏడాది క్రితమే పెళ్లయినా..

ABN , First Publish Date - 2022-06-09T19:54:36+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకుని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత భర్త అసలు రూపం బయటపడింది..

నా వాట్సప్, ఫేస్‌బుక్ చాటింగ్‌ను భర్త చదువుతున్నాడంటూ కేసు పెట్టిన భార్య.. ఏడాది క్రితమే పెళ్లయినా..

వారిద్దరూ ప్రేమించుకుని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత భర్త అసలు రూపం బయటపడింది.. ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలయ్యాయి.. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే భర్త, భార్య వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఆమెను అనుమానించడం ప్రారంభించాడు.. ఆమె మొబైల్ తీసుకుని కాల్ డిటైల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఛాటింగ్‌ను గమనించేవాడు.. అంతేకాదు కట్నంగా కారు కావాలని వేధించడం ప్రారంభించాడు.. దీంతో ఆ మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

మొత్తానికి అనుకున్నది సాధించిన యువతి.. తనను తానే పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కూడా..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అభిషేక్‌కు, జ్యోతి శర్మకు ఏప్రిల్ 16, 2021న వివాహం జరిగింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగస్తుడైన అభిషేక్ పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత కశ్మీర్ వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత తనకు కట్నంగా కారు కావాలని భార్యపై అభిషేక్ ఒత్తిడి చేశాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. కొన్ని రోజుల తర్వాత కొనిస్తామని సర్దిచెప్పారు. రెండు నెలల తర్వాత సెలవు పెట్టి అభిషేక్ ఇంటికి వెళ్లాడు. తన భార్యపై అనుమానం పెంచుకుని ఆమె మొబైల్‌ను చెక్ చేయడం ప్రారంభించాడు. ఆమె మొబైల్‌లోని కాల్ డిటైల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఛాటింగ్‌ను గమనించేవాడు. అయినా జ్యోతి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. 


సెప్టెంబర్‌లో అత్తింట్లో ఉండగానే జ్యోతి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేసి అభిషేక్ డ్యూటీకి వెళ్లిపోయాడు. అత్తింటి వారు కనీసం హాస్పిటల్ బిల్ కూడా కట్టలేదు. జ్యోతి తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కట్నం ఇస్తేనే తప్ప తమ ఇంటికి రావొద్దని అభిషేక్ తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో జ్యోతి తన భర్తపై, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-06-09T19:54:36+05:30 IST