మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..

ABN , First Publish Date - 2022-07-02T23:57:41+05:30 IST

అంతవరకూ బాగున్న ఆ మహిళ.. మరుక్షణంలో చిన్న కారణంతో విగతజీవిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. తనతో పాటూ ఉన్న తల్లి.. చివరకు తన కళ్ల ముందే.. తిరిగిరాని లోకాలకు..

మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..
ప్రతీకాత్మక చిత్రం

అంతవరకూ బాగున్న ఆ మహిళ.. మరుక్షణంలో చిన్న కారణంతో విగతజీవిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. తనతో పాటూ ఉన్న తల్లి.. చివరకు తన కళ్ల ముందే.. తిరిగిరాని లోకాలకు చేరుకుంటుందని.. పాపం ఆ చిన్నారికి తెలీదు. ఢిల్లీలోని గాంధీనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ‘‘మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది’’.. అంటూ చుట్టుపక్కల వారు భర్తకు ఫోన్ చేశారు. దీంతో భర్త కంగారుగా ఇంటికి పరుగులు తీశాడు. తీరా వచ్చేసరికి భార్యను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. వివరాల్లోకి వెళితే..


ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్‌లోని రఘువీర్ పురా ప్రాంతంలో అనిల్‌ పాశ్వాన్‌ అనే వ్యక్తి.. భార్య రాధాదేవి(22), నాలుగేళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనిల్ స్థానికంగా టైలర్‍‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబంలో అనుకోకుండా విషాద ఘటన చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. శుక్రవారం అనిల్ టైలర్ దుకాణానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో అతడి భార్య బట్టలు ఆరేసేందుకు మేడ పైకి వెళ్లింది.

పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..


అనంతరం తన కొడుకుతో సహా కిందకు కిందకు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి జారి కిందపడింది. ఈ క్రమంలో ఆమె మెడలోని లాకెట్.. గొంతులోకి చొచ్చుకుపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చిన్నారి కేకలను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అనిల్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. దీంతో భర్త కంగారుగా ఇంటికి వచ్చి.. భార్యను ఆ పరిస్థితిలో చూసి బోరున విలపించాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..

Read more