నా కూతుర్ని చంపేశానంటూ ఓ తల్లి ఫోన్‌కాల్.. పోలీసులు వెళ్లేసరికి ఇంట్లో షాకింగ్ సీన్.. అసలు కారణమేంటో తెలిసి..

ABN , First Publish Date - 2022-06-15T22:37:31+05:30 IST

మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని వడోదర పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది..

నా కూతుర్ని చంపేశానంటూ ఓ తల్లి ఫోన్‌కాల్.. పోలీసులు వెళ్లేసరికి ఇంట్లో షాకింగ్ సీన్.. అసలు కారణమేంటో తెలిసి..

మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని వడోదర పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.. `నా కూతుర్ని చంపేశాన`ని ఓ మహిళ పోలీసులకు చెప్పింది.. పోలీసులు వెంటనే ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లారు.. అక్కడ ఓ 13 ఏళ్ల బాలిక రక్తపుమడుగులో పడి ఉంది.. అయితే ఆ బాలిక ప్రాణాలతోనే ఉంది.. వెంటనే ఆ బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఆ తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

అందరూ చూస్తుండగానే చెప్పులతో ఓ యువకుడిని చితకబాదిన యువతి.. నడిరోడ్డుపై అతడు చేసిన నిర్వాకానికి..


ఆ ఘటన గురించి పోలీసులు వివరాలు వెల్లడించారు. `తల్లే కూతురిపై కత్తితో దాడి చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాం. బాలిక మెడపై, ఇతర శరీర భాగాలపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. అయితే ఆ గాయాలన్నీ చిన్న చిన్నవే. ఇంటి పని విషయంలో ఆ తల్లీకూతుళ్లకు గత రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంటిపనిలో తన కూతురు తనకు చిన్న సహాయం కూడా చేయదని, చాలా పొగరుగా ప్రవర్తిస్తుందని, మంగళవారం కూడా పని విషయమై తమ మధ్య గొడవ జరిగిందని, సహనం కోల్పోయి కూతురిని పొడిచేశానని తల్లి చెప్పింది. ఆ మహిళ తన భర్త నుంచి విడిపోయి కూతురితో కలిసి నివసిస్తోంద`ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. 


తన కూతురిని చంపెయ్యాలనే ఉద్దేశం ఆ తల్లికి లేదని, ఏదేమైనా బాలిక స్పృహలోకి వచ్చాక ఆమె స్టేట్‌మెంట్ కూడా తీసుకుని ఈ కేసులో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. బాలిక ఇంకా స్ప‌ృహలోకి రాకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై ఇంకా ఎలాంటి కేసూ నమోదు చేయలేదు.   

Updated Date - 2022-06-15T22:37:31+05:30 IST