భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య.. తన కథ చెప్పి పోలీసులకు లొంగిపోయి..
ABN , First Publish Date - 2022-04-20T08:21:51+05:30 IST
ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్ పోలీసులకు ఓ మహిళ కోలుకోలేని షాకిచ్చింది.. ఆ మహిళ తన భర్తను చంపి అతడి తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. తన భర్తను చంపేశానని, లొంగిపోవాలని వచ్చానని చెప్పింది..

ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్ పోలీసులకు ఓ మహిళ కోలుకోలేని షాకిచ్చింది. ఆ మహిళ తన భర్తను చంపి అతడి తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్తను చంపేశానని, లొంగిపోవాలని వచ్చానని చెప్పింది.. భర్తను అంత క్రూరంగా చంపినందుకు ఆమె మొహంలో చిన్న పశ్చాత్తాపం కూడా లేకపోవడం పోలీసులకు విస్మయం కలిగిచింది.
ఓ మహిళ తన భర్తను నరికి చంపి, అతన తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం జూలాఘాట్లో కలకలం రేపింది. తన భర్తను చంపేశానని, లొంగిపోదామని వచ్చామని ఆమె పోలీసులకు చెప్పింది. షాకైన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను చంపినందుకు ఆమెకు అస్సలు పశ్చాత్తాపం లేదు.
తన భర్తను ఎందుకు అంత కిరాతంగా చంపిందో ఆ మహిళ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పోస్ట్‌మార్టమ్ అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.