ప్రేయసి ఫోన్ చేసి పిలిచింది కదా అని ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. పక్కింటి వాళ్లు చూడటంతో..

ABN , First Publish Date - 2022-02-24T23:56:25+05:30 IST

ప్రేయసి నుంచి ఫోన్ చేసి తన ఇంటికి రావాలని పిలవడంతో 36ఏళ్ల యువకుడు ముందూ వెనకా ఆలోచించలేదు. ఉన్నఫళంగా బయల్దేరి వెళ్లి.. ప్రేయసి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదికాస్తా పక్కంటి వాళ్లు చూడటం

ప్రేయసి ఫోన్ చేసి పిలిచింది కదా అని ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. పక్కింటి వాళ్లు చూడటంతో..

ఇంటర్నెట్ డెస్క్: ప్రేయసి నుంచి ఫోన్ చేసి తన ఇంటికి రావాలని పిలవడంతో 36ఏళ్ల యువకుడు ముందూ వెనకా ఆలోచించలేదు. ఉన్నఫళంగా బయల్దేరి వెళ్లి.. ప్రేయసి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదికాస్తా పక్కంటి వాళ్లు చూడటంతో అక్కడ దారుణం జరిగిపోయింది. బిహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భాగల్పూర్ ప్రాంతంలోని చిహుటియా గ్రామానికి చెందిన జోగి సింగ్(36).. జాముయి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ బుధవారం రాత్రి జోగి సింగ్‌కు ఫోన్ చేసి తన ఇంటికి రావాలంటూ పిలిచింది. ప్రేయసి నుంచి పిలుపు రావడంతో జోగి సింగ్.. ముందూ వెనకా ఆలోచించలేదు. ఉన్నఫళంగా బయల్దేరి.. ప్రియురాలి ముందు ప్రత్యక్షం అయ్యాడు. జోగి సింగ్ సదరు మహిళ ఇంట్లోకి వెళ్లడాన్ని ఆమె పక్కింటి వాళ్లు గమనించారు. వెంటనే విషయాన్ని మరికొంత మందికి చేరవేశారు. ఈ నేపథ్యంలో సదరు ఇంట్లోకి  పెద్ద ఎత్తున ప్రవేశించిన స్థానికులు.. జోగి సింగ్‌ను చితకబాదారు. సదరు మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో స్థానికుల చేతిలో జోగి సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ జోగి సింగ్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జోగి సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి సింగ్ సోదరుడు గంగాధర్ సింగ్ మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు సదరు మహిళ, జోగి సింగ్ ఇద్దరూ తమిళనాడులో ఒకే దగ్గర పని చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం.. అక్రమ సంబంధం వరకూ వెళ్లినట్టు చెప్పాడు. కాగా.. సదరు మహిళ కూడా జోగి సింగ్ మరణానికి కారణం స్థానికులే అని పోలీసులకు తెలిపింది. వారిపై కేసు నమోదు చేసి, కఠిన శిక్ష పడే విధంగా చేయాలని పోలీసులను కోరింది.Updated Date - 2022-02-24T23:56:25+05:30 IST