Shocking: చిన్న బఠాణీ గింజ ఎంత పని చేసింది.. రూ.20 వేలు కోల్పోయిన మహిళ!
ABN , First Publish Date - 2022-08-15T21:24:28+05:30 IST
సాధారణంగా ఏదైనా స్థలాన్ని లేదా ఇంటిని అద్దెకు తీసుకునే ముందు పెద్ద మొత్తంలో డబ్బును అడ్వాన్స్‌గా చెల్లిస్తాం

సాధారణంగా ఏదైనా స్థలాన్ని లేదా ఇంటిని అద్దెకు తీసుకునే ముందు పెద్ద మొత్తంలో డబ్బును అడ్వాన్స్‌గా చెల్లిస్తాం. ఆ ఇంటిని ఖాళీ చేసిన తర్వాత యజమాని నుంచి ఆ అడ్వాన్స్ తిరిగి తీసుకుంటాం. అన్ని రోజులు మనం ఉపయోగించిన ఇంటికి ఏదైనా నష్టం జరిగితే, యజమానులు అడ్వాన్స్‌లో కొంత భాగాన్ని తీసుకుని, మిగిలినది ఇస్తుంటారు. అయితే ఓ యువతి చిన్న బఠాణీ గింజ వల్ల రూ.20 వేల అడ్వాన్స్‌ను కోల్పోయింది.
ఇది కూడా చదవండి..
Flight Delay: బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ మధ్య వాట్సాప్ ఛాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం!
ఇంటి యాజమాని నుంచి తనకెదురైన అనుభవం గురించి మత్లిడా అనే మహిళ Tik Tok ద్వారా వెల్లడించింది. `చాలా విచిత్రమైన కారణాలు చెప్పి మా యజమాని మాకు రావాల్సిన రూ.20 వేల అడ్వాన్స్ ఇవ్వలేదు. ఫ్రీజర్‌లో మాకు సంబంధించిన చిన్న బఠాణీ గింజ ఉండిపోయింది. దానిని క్లీన్ చేయడం ఆమెకు కష్టమై ఉంటుంది. అలాగే ఒక గదిలో ఖాళీ డ్రింక్ బాటిల్ ఉండిపోయింది. బహుశా దాని వాసన ఆమెకు నచ్చలేదనుకుంటా. అలాగే హ్యుమిడిఫైర్ కూడా ఒక గదిలో ఆమెకు కనిపించింది. నిజానికి అది మాది కాదు.. మా కంటే ముందు ఉన్న వాళ్లది. వాటిని ఇంటి నుంచి తీసుకెళ్లలేదని చెప్పి ఆమె మా అడ్వాన్స్ డబ్బులు తీసుకుంద`ని మత్లిడా పేర్కొంది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.