బాయ్‌ఫ్రెండ్‌పై నమ్మకంతో భర్తకు విడాకులిచ్చిన మహిళ.. తర్వాత 2ఏళ్లపాటు ప్రియుడితో సహజీవనం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇదీ..

ABN , First Publish Date - 2022-04-08T00:03:08+05:30 IST

ఓ యువకుడితో తమ కూతురు ప్రేమాయణం సాగిస్తుందని గ్రహించిన తల్లిదండ్రులు.. పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ అబ్బాయిని చూసి, అమెకు పెళ్లి జరిపించారు. అయితే

బాయ్‌ఫ్రెండ్‌పై నమ్మకంతో భర్తకు విడాకులిచ్చిన మహిళ.. తర్వాత 2ఏళ్లపాటు ప్రియుడితో సహజీవనం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడితో తమ కూతురు ప్రేమాయణం సాగిస్తుందని గ్రహించిన తల్లిదండ్రులు.. పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ అబ్బాయిని చూసి, అమెకు పెళ్లి జరిపించారు. అయితే బాయ్‌ఫ్రెండ్‌పై ఉన్న నమ్మకంతో సంవత్సరం తిరగకుండానే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. తర్వాత ప్రియుడి వద్దకు చేరుకుంది. 2ఏళ్లపాటు అతడితో సహజీవనం చేసింది. తాజాగా ప్రియుడి మాటలు విని షాకైన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి.. కమలాపూర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. విషయం కాస్తా యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంగతి యువతికి తెలిసి.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా రాజును కోరింది. అయితే దానికి అతడు నిరాకరించడంతో షాకైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకుంది. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతిని రాజు వదల్లేదు. ఏదో ఒకసాకుతో యువతి భర్తకు తెలియకుండా ఆమెను కలవడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో అతడు చెప్పిన మాటలు విని.. సంవత్సరం తిరక్కుండానే భర్తకు విడాకులు ఇచ్చేసింది.


 అనంతరం రాజుతో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. తాజాగా రాజు వద్ద ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. పెళ్లి చేసుకోవడానికి రాజు మరోసారి నిరాకరించడంతో షాకైంది. అంతేకాకుండా వెరొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం ఉన్నట్టు తెలుసుకుని విస్తుపోయింది. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించింది. తన సమస్యను వివరించి.. రాజుతో తన పెళ్లి జరిపించాలని అధికారులను కోరింది. లేదంటే తన జీవితం నాశనం అవుతుందని వాపోయింది. ఈ క్రమంలో యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. రాజుతో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 
Updated Date - 2022-04-08T00:03:08+05:30 IST