ముక్కూముఖం తెలియని వాడితో ‘ఆన్‌లైన్ ప్రేమ’లో పడిపోతే ఇలాంటివే జరుగుతాయ్.. రూ.70 లక్షలు మటాష్..!

ABN , First Publish Date - 2022-10-07T21:26:44+05:30 IST

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడితో ఆ మహిళ ప్రేమలో పడింది. ఓ డేటింగ్ యాప్‌లో అతడిని కలుసుకుని మనసిచ్చింది.

ముక్కూముఖం తెలియని వాడితో ‘ఆన్‌లైన్ ప్రేమ’లో పడిపోతే ఇలాంటివే జరుగుతాయ్.. రూ.70 లక్షలు మటాష్..!

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడితో ఆ మహిళ ప్రేమలో పడింది. ఓ డేటింగ్ యాప్‌లో అతడిని కలుసుకుని మనసిచ్చింది. ఆ యువకుడు రాసిన ప్రేమ కవితలు విని మురిసిపోయింది. ఆ యువకుడి నిజ స్వరూపం తెలుసుకునే సరికి ఆమె దాదాపు 70 లక్షల రూపాయలు కోల్పోయింది. క్రిస్టీన్ అనే అమెరికా మహిళకు డేటింగ్ యాప్ `హింజ్` ద్వారా నైజీరియన్‌కు చెందిన విలియం ఓజో అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను గ్రీస్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ను అని మాయ మాటలు చెప్పాడు. అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి అయిన క్రిస్టీన్‌ను తన వలలో వేసుకున్నాడు. 


ఇది కూడా చదవండి..

మీ అమ్మాయి మా పరువు తీసింది.. ప్రియుడితో వెళ్లిపోయిందంటూ అత్తింట్లో ఆగ్రహం.. ఏడాది తర్వాత ఊహించని ట్విస్ట్..!


ఆమెకు ప్రేమ కవితలు పంపించేవాడు. ఫోన్ చేసి గంటలు మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఒక రోజు తనకు రూ.5 లక్షలు కావాలని, వెంటనే ఇచ్చేస్తానని అడిగాడు. క్రిస్టీన్ వెంటనే అతడి ఖాతాలో రూ.5 లక్షలు వేసేసింది. అన్నట్టుగానే నెల రోజుల్లో ఆ డబ్బును విలియం.. క్రిస్టీన్‌కు ఇచ్చేశాడు. దీంతో అతడిపై క్రిస్టీన్‌కు నమ్మకం పెరిగింది. ఆ తర్వాత నుంచి ఏదో అవసరం ఉందని చెప్పి దఫదఫాలుగా రూ.70 లక్షలు క్రిస్టీన్ నుంచి తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత క్రిస్టీన్ ఫోన్ చేయగా విలియం ఫోన్ నెంబర్ స్విచ్ఛాప్ అని వచ్చింది. తాను మోసపోయినట్టు తెలుసుకున్న క్రిస్టీన్ పోలీసులను ఆశ్రయించింది. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విలియం గ్రీస్‌కు చెందిన వాడు కాదని, నైజీరియా సైబర్ మాఫియాకు చెందిన వ్యక్తి అని కనుగొన్నారు. ఆ విషయం విని క్రిస్టీన్ షాక్ అయింది. అలాగే, తను ఇచ్చిన డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు లేవని తెలుసుకుని బాధపడుతోంది.  

Read more