ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిన భర్త.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-22T02:11:42+05:30 IST

ఎప్పటిలాగే భర్త ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిపోయాడు. పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న భార్య దారుణానికి పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తన భార్య చేసిన పనికి ఒక్క

ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిన భర్త.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భార్య ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే భర్త ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిపోయాడు. పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న భార్య దారుణానికి పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తన భార్య చేసిన పనికి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌కు చెందిన సంతోష్ కుమార్‌ కొన్నేళ్ల క్రితం మేనక(36) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గు ఆడపిల్లలు కూడా జన్మించారు. వివాహం తర్వాత సంతోష్ తన ఫ్యామిలీని గోరఖ్‌పూర్‌కు తరలించాడు. అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. కుటుంబాన్ని పోషించేందుకు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం కూడా సంతోష్ కుమార్ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మేనక దారుణానికి పాల్పడింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం డ్యూటీ నుంచి ఇంటికి తిరిగొచ్చిన సంతోష్.. విగత జీవిగా వేలాడుతున్న భార్యను చూసి షాకయ్యాడు. విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మేనక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. తన పిల్లలు కొద్ది రోజుల క్రితమే బిహార్‌కు వెళ్లినట్టు చెప్పాడు. అయితే తన భార్య ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం తనకు కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 
Updated Date - 2022-02-22T02:11:42+05:30 IST