మీ భార్య ఈ రోజు డ్యూటీకి రాలేదంటూ పోలీసుల నుంచి ఫోన్.. కుటుంబ సభ్యులంతా కంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-02-28T02:19:05+05:30 IST

భర్త ప్రైవేట్ ఉద్యోగం, భార్య పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండేవారు. రోజూ మాదిరిగానే ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉండేవారు. అయితే శుక్రవారం మాత్రం భార్య విధులకు వెళ్లలేదు...

మీ భార్య ఈ రోజు డ్యూటీకి రాలేదంటూ పోలీసుల నుంచి ఫోన్.. కుటుంబ సభ్యులంతా కంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

అన్ని సౌకర్యాలు ఉన్నా.. కొందరు అకస్మాత్తుగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంతటి బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై విచారిస్తే.. కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. విలువైన జీవితాన్ని మధ్యలోనే ముగించేవారు కొందరైతే, చేయరాని తప్పులు చేసి జైలు పాలయ్యేవారు కొందరు ఉంటారు. తాజాగా చెన్నైలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త ప్రైవేట్ ఉద్యోగం, భార్య పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండేవారు. రోజూ మాదిరిగానే ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉండేవారు. అయితే శుక్రవారం మాత్రం భార్య విధులకు వెళ్లలేదు. ‘‘మీ భార్య ఈ రోజు డ్యూటీకి రాలేదు’’.. అంటూ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. కంగారుగా ఇంటికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు.. షాకింగ్ సీన్ కనిపించింది.


చెన్నై వేలూరు సమీపంలోని మంజూరుపట్టుకి చెందిన ఇందుమది(30), క్రిష్ణమూర్తి దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, భార్య రిజర్వ్‌ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆలనాపాలనా చూసేందుకు పిల్లలను ఇడయంబట్టు గ్రామంలోని క్రిష్ణమూర్తి తల్లిదండ్రుల వద్ద ఉంచారు. రోజూ ఎవరి విధుల్లో వారు బిజీ బిజీగా ఉండేవారు. దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రోజూ విధులకు వెళ్లే ఇందుమది.. శుక్రవారం మాత్రం వెళ్లలేదు. దీంతో సహోద్యోగులు క్రిష్ణమూర్తి, అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ‘‘ఇందుమది ఈరోజు డ్యూటీకి రాలేదు’’ అని చెప్పారు.

కొత్తగా కోడలు వచ్చిందని సంతోష పడ్డారు.. అయితే శోభనం మరుసటి రోజే అంతా ఆస్పత్రిలో చేరిక.. చివరకు అసలు విషయం తెలుసుకుని..


దీంతో క్రిష్ణమూర్తితో సహా కుటుంబ సభ్యులంతా కంగారుగా పోలీస్‌ క్యార్టర్స్‌లోని ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఇందుమది ఉరి వేసుకుని ఉండడం చూసి షాక్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో కనిపించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘నా చావుకు ఎవరూ కారణం కారు. పని భారం ఎక్కువైంది, కనీసం సెలవులు కూడా దొరకడంలేదు. దీంతో పిల్లలను చూసొద్దామన్నా వీలు లేకుండా ఉంది. ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా’’.. అని రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..Updated Date - 2022-02-28T02:19:05+05:30 IST