డ్యూటీ పూర్తయ్యాక రూమ్‌కు తిరిగొచ్చి ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్.. చెవిలో ఉన్న వాటిని చూసి..

ABN , First Publish Date - 2022-02-20T20:39:44+05:30 IST

ఆమె ఒక మహిళా కానిస్టేబుల్. ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్లింది. డ్యూటీ పూర్తయ్యాక రూమ్‌కు తిరిగొచ్చిన ఆమె.. దారుణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థా

డ్యూటీ పూర్తయ్యాక రూమ్‌కు తిరిగొచ్చి ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్.. చెవిలో ఉన్న వాటిని చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఒక మహిళా కానిస్టేబుల్. ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్లింది. డ్యూటీ పూర్తయ్యాక రూమ్‌కు తిరిగొచ్చిన ఆమె.. దారుణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


బిహార్‌లోని కైమూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. శిక్షణ అనంతరం ఆమె జాబ్‌లో జాయిన్ అయింది. తాజాగా చైన్‌పూర్‌లోని స్టేషన్ బదలీ అయిన ఆమె.. ఎప్పటిలాగే శనివారం డ్యూటీకి వెళ్లింది. విధులు ముగించుకుని సాయంత్రం తన గదికి చేరుకున్న ఆమె.. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో.. వెంటనే ఆమె గదికి చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి.. గదిలోకి ప్రవేశించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కిందకు దించారు. ఆమె చెవిలో హెడ్‌ఫోన్స్ ఉండటాన్ని చూసి అధికారులు తొలుత షాకయ్యారు. తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశ అయింది. 
Updated Date - 2022-02-20T20:39:44+05:30 IST