-
-
Home » Prathyekam » Woman Claims She Is Allergic To Gravity Spends 23 Hours A Day In Bed sgr spl-MRGS-Prathyekam
-
Shocking: ఇలాంటి వ్యాధి ఎవరికీ ఉండదేమో.. ఆమె రోజులో 23 గంటలు మంచం పైనే.. కిందకు దిగితే ఆమె పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2022-08-31T21:07:23+05:30 IST
ఈ భూమిపై నివసించే ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు.

ఈ భూమిపై నివసించే ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అరుదైన అలెర్జీలతో, వింత జబ్బులతో బాధపడే వారి గురించి విని ఆశ్చర్యపోతుంటాం. అమెరికాకు చెందిన 28 ఏళ్ల లిండ్సీ జాన్సన్ అనే మహిళ గురుత్వాకర్షణ శక్తి అలెర్జీతో (Allergic To Gravity) బాధపడుతోంది. యుఎస్ నేవీకి చెందిన మాజీ ఏవియేషన్ డీజిల్ మెకానిక్ అయిన లిండ్సీ జాన్సన్ 2015లో పొత్తికడుపు నొప్పి, వెన్నునొప్పికి గురైంది. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోజుకు 10 సార్లు వాంతులు చేసుకోవడం, తరచుగా మూర్ఛపోవడం వంటి లక్షణాలు ఎక్కువయ్యాయి.
ఇది కూడా చదవండి..
UP: యువతి గొంతు కోసిన యువకుడు.. కారణమేంటో తెలిస్తే.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..
ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన తర్వాత ఆమె పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ (PoTS)తో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి అని తెలిపారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఓ గ్రావిటేషనల్ అలెర్జీ. ఒక వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు అతడి రక్త పరిమాణం తగ్గడం, హృదయ స్పందన రేటులో అసాధారణ పెరుగుదల వంటివి కనబడతాయి. కుర్చీలో కూర్చున్నా, మంచం మీద పడుక్కున్నా అలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో లిండ్సీ రోజులో 23 గంటలు మంచం మీదే గడుపుతుంది. స్నానం కూడా వీల్ చైర్‌లోనే చేస్తుంది.
`28 సంవత్సరాల వయస్సులో షవర్ చైర్ ఉపయోగించాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు లేచి నిలబడలేను. పడుకుంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. నేను సాధారణ జీవితాన్ని గడపలేనని నాకు తెలుసు. నా అనారోగ్యం ఏంటో తెలుసకోవడానికే నేను చాలా కష్టపడవలసి వచ్చింది. నేను ఇక ఎప్పటికీ ఇంటికి వెళ్లలేను. ఎప్పుడూ డాక్టర్ పర్యవేక్షణలో హాస్పిటల్‌లో ఉండాల్సిందేన`ని లిండ్సే తెలిపింది.