ఆమెతో మాట్లాడేందుకు పురుషులు తహతహ.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2022-05-21T14:56:49+05:30 IST

ఆ యువతితో మాట్లాడాలని పలువురు పురుషులు తహతహలాడుతుంటారు.

ఆమెతో మాట్లాడేందుకు పురుషులు తహతహ.. కారణం ఇదే!

ఆ యువతితో మాట్లాడాలని పలువురు పురుషులు తహతహలాడుతుంటారు. ఆమె మీటింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.. ఇది వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ స్త్రీలో ఏముందని? ఆమెతో మాట్లాడేందుకు అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే ఆ వివరాలు వెంటనే తెలుసుకుందాం.  ఆ యువతి పేరు సామన్త్య. ఆమె ఆస్ట్రేలియాకు చెందినది. పురుషులు తనను కలుసుకునేందుకు, మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ తీసుకుంటారని ఆమె తెలిపింది. ఆమెతో మాట్లాడేందుకు చాలామంది లక్షల రూపాయలు చెల్లిస్తారు. 


దీంతో ఈ యువతి ఎలాంటివారనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తుతుంది. ఈ యువతి రెండు పుస్తకాలు కూడా రాశారు. పురుషులు తన దగ్గరకు వచ్చి వారి జీవితానికి సంబంధించిన విషయాలను తనతో పంచుకోవడం తన అదృష్టం అని ఆ యువతి చెప్పింది. తనను కలిసేవారు వారి జీవితంలోని తప్పొప్పులను తనకు చెబుతారని ఆమె తెలిపింది. వీటిని తెలుసుకున్న తర్వాత తాను రెండు పుస్తకాలు కూడా రాశానని తెలిపింది. తనతో మాట్లాడాలనే కోరికతోనే చాలా మంది తనను కలుసుకుంటున్నారని ఆమె తెలిపింది. ఇంతేకాదు తాను మీటింగ్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటానని ఆమె చెప్పారు. అయినప్పటికీ తనతో మాట్లాడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. నిజానికి వారికి ఒక కౌన్సెలర్ అవసరం. అయినా చాలామంది తన దగ్గరకు మాత్రమే రావడానికే ఇష్టపడతారని పేర్కొంది. గతంలో సామన్త్య జర్నలిస్టుగా పనిచేశారు. తరువాత ఉద్యోగం మానేసి ఈ పనిని చేపట్టారు.

Updated Date - 2022-05-21T14:56:49+05:30 IST