Viral News: భర్తకు తగిన గుణపాఠం చెప్పిన భార్య.. భర్త నిర్వాకం గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి..
ABN , First Publish Date - 2022-08-14T21:21:01+05:30 IST
వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు భార్య గట్టి షాకిచ్చింది.

వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు భార్య గట్టి షాకిచ్చింది. భర్త తీరుని బహిరంగంగా అందరికీ తెలియపరచాలనుకుంది. ఊరందరి ముందు అతని పరువు తీసింది. అందుకోసం ఆమె విభిన్నమైన మార్గం ఎంచుకుంది. భర్త నిర్వాకం గురించి పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Boy Beaten To Death: దారుణం.. నా కుండలో నీళ్లే తాగుతావా? అంటూ దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్!
ఆస్ట్రేలియా (Australia)కు చెందిన జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది. స్టీవ్ తనను మోసం చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని పసిగట్టింది. భర్తకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. అందుకోసం ఓ ప్రముఖ వీక్లీ మ్యాగజీన్‌ను సంప్రదించి ప్రకటన ఇచ్చింది. `డియర్ స్టీవ్.. నువ్వు ఆమెతో సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా. నువ్వు ఎంత మోసగాడివో ఈ టౌన్ మొత్తం తెలుసుకుంటుంది.. ఫ్రమ్ జెన్నీ` అని యాడ్ ఇచ్చింది.
అంతే కాదు ఆ యాడ్‌కు అవసరమైన డబ్బులును అతని క్రెడిట్ కార్డు నుంచే తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ ప్రకటనను చదివిన పాఠకులు చాలా మంది సదరు మ్యాగజీన్‌కు ఉత్తరాలు రాశారు. `ఆమె ఎవరు? ఆమెను ఎందుకలా మోసం చేశాడు` అంటూ ఎంక్వైరీలు ప్రారంభించారు. దీంతో మ్యాగజీన్ నిర్వాహకులు ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. తమకు స్టీవ్ గురించి తెలియదని పాఠకులకు వివరణ ఇచ్చారు. అలాగే జెన్నీ గురించి ఎలాంటి సమాచారమూ బయటపెట్టలేమని పేర్కొన్నారు.